Rajamouli-Mahesh : రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వీరి కాంబోలో సినిమాకు సంబంధించి ఇటీవల లైన్ చెప్పి అభిమానులను మెస్మరైజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్‌లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఆ తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో తెరకెక్కనుందనే విషయాన్ని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారని టాక్. ఒక తెలుగు సినిమాను ఇంగ్లీష్‌లో కూడా రూపొందించడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఈ వార్త నిజమైతే ఆ ఘనత రాజమౌళికే దక్కుతుంది. అలాగే మహేష్ బాబు సైతం అరుదైన ఘనతను సాధించినట్టవుతుంది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే చిత్రం ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
Rajamouli-Mahesh : భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్..
సినిమాపై వస్తున్న రూమర్స్‌ను దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మహేష్ బాబు అభిమానులు ఈ వార్తను సోసల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు, రాజమౌళి చిత్రాన్ని దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారని టాక్ కూడా నడుస్తోంది.