రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదల చేసింది.తాజాగా యుట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం రికార్డ్ లను తిరగరాస్తూ సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది.నిన్న జరగాల్సిన ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఈవెంట్ సడెన్ గా వాయిదా పడిన విషయం తెలిసిందే
అయితే తాజాగా చిత్ర యూనిట్ మరో ఈవెంట్ ను ప్లాన్ చేస్తుంది.ఈ ఈవెంట్ ను ప్రత్యేకంగా మీడియా కోసం చిత్ర యూనిట్ ఏర్పాటు చేస్తుందని సమాచారం.జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్ పై ప్రస్తుతం చిత్ర యూనిట్ దృష్టి సారించింది.అందులో భాగంగా రాజమౌళి అండ్ టీమ్ మూవీ ప్రమోషన్స్ కోసం చాలా పెద్ద లెవల్ లో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.