రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే వెండితెరపై అద్భుతాన్ని చూసిన ఫీలింగ్ కలుగుతుందనే విషయం అందరికి తెలిసిందే. ఇక మహేష్ బాబుని జక్కన్న ఏ విధంగా ఆవిష్కరిం బోతున్నాడు అనే ఆసక్తి మహేష్ ఫ్యాన్స్ తో సహా రాజమౌళి ఫ్యాన్స్ లోకూడా ఉంది. ఇప్పటి వరకు చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లలో ఒకటి జానపద చిత్రం కాగా, ఒక హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాని ఎంచుకున్నారు. ఈ సారి జక్కన్న చేయబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా మూవీ జోనర్ఎలా ఉండబోతుంది అనే దానికి తాజాగా అతనే ఫుల్ స్టాప్ పెట్టారు.
ప్రస్తుతం రాజమౌళి అమెరికాలో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కీనోట్ స్పీకర్ గా పార్టిసిపేట్ చేశారు. అక్కడ తన సినిమాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా నెక్స్ట్ చేయబోతే సినిమాపై కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ రాబోతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ఒక ప్రపంచ యాత్రికుడి సాహసాలు చూపించబోతున్నట్లు స్పష్టం చేశారు. దీనిని బట్టి మహేష్ బాబు ఈ సినిమాలో వరల్డ్ ట్రావెలర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.
ఇందులో భాగంగానే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎవరికి తెలియని అద్బుతాలు ఆవిష్కరించే ఒక సాహస యాత్రికుడిగా సూపర్ స్టార్ పాత్ర ఉండబోతుందని వినికిడి. మెజారిటీ షూటింగ్ అమెజాన్ ఫారెస్ట్ నేపధ్యంలోనే ఉంటుందని తెలుస్తుంది. ఈ సారి ఎంచుకున్న కథ బట్టి చొస్తే రాజమౌళి టార్గెట్ పాన్ వరల్డ్ గా కనిపిస్తుందని అందరూ భావిస్తున్నారు. యూనివర్సల్ లెవల్ లో అందరికి ఇలాంటి కాన్సెప్ట్ రీచ్ అవుతుంది కాబట్టి దీనిని ఎంపిక చేసుకున్నారని టాక్. మరి ఈ మూవీతో సూపర్ స్టార్ పాన్ వరల్డ్ స్టార్ గా మారుతాడెమో చూడాలి.