Rajamouli : సౌత్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల విడుదల చేసిన బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించిన తన చిత్రం ఆర్‌ఆర్ఆర్ కు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో ఉత్తమ దర్శకుడిగా అగ్ర బహుమతిని గెలుచుకున్నారు. ఈ అవార్డులకు సంబంధించిన పిక్స్ , వీడియోస్ ఆర్‌ఆర్‌ఆర్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ విడుదల చేసింది. అవార్డును తీసుకున్న రాజమౌళీ తన సక్సెస్ కు కారణమైన చిత్ర నిర్మాత, తన కుటుంబానికి, చిత్ర తారాగణం , సిబ్బందికి, జ్యూరీకి, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి రాజమౌళి అసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మీ నుండి ఈ అవార్డును అందుకోవడం చాలా గొప్ప గౌరవం, నేను దానిని నిజంగా అభినందిస్తున్నాను అని అన్నారు. ఈ అవార్డు ద్వారా మీరు నా చిత్ర నటీనటులు, సిబ్బందిని గౌరవించారన్నారు. అంతే కాదు దక్షిణ భారతదేశంలోని ఒక చిన్న చిత్రాన్ని చాలా మందిని చూసేటట్లు చేసారని పేర్కొన్నారు. వెస్ట్ కంట్రీస్‌లోనూ ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూసిన ప్రజలు భారతీయులు ఎలా స్పందిస్తారో అదే విధంగా ప్రతిస్పందించారు అని ఆయన అన్నారు. ఇదే క్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ ఎపిక్ ప్రీ-ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి దర్శకుడు మాట్లాడుతూ, ప్రేక్షకుల ముఖాల్లో స్వచ్ఛమైన ఆనందం, విస్మయం నేను చూశానన్నారు. ఇదే నా ప్రేక్షకుల నుండి నేను కోరుకునేది అని తెలిపారు.

ఇదిలా ఉండగా, జనవరి 11న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు రాజమౌళి , ఆర్‌ఆర్‌ఆర్ స్టార్‌లు రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ లు కూడా హాజరుకానున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తమ విదేశీ చిత్రంగా 2 విభాగాలలో నామినేట్ చేయబడింది. చిత్రం యొక్క ట్రాక్ నాటు నాటు కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఉత్తమ ఒరిజినల్ పాటగా ఈ పాటను నామినేట్ చేశారు. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో కూడా ఈ పాటు చేరింది.

ఆర్‌ఆర్‌ఆర్ 1920 నాటి కథ. ఇది ఇద్దరు లెజెండరీ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ లను ఆధారంగా చేసుకుని తీసిన కల్పిత కథ. ఇందులో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. అలియా భట్, అజయ్ దేవగన్, ఒలివియా మోరిస్, సముద్రఖని, శ్రియా శరణ్ కూడా నటించారు. మూవీ క్రిటిక్స్ కూడా ఈ సినిమాకు మంచి రివ్యూను అందించారు. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈ సినిమాకు నీరాజనాలు పలికారు. బాక్సాఫీస్ లోనూ మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది.
Advertisement