Happy Birthday Rajamouli:నేడు దర్శక ధీరుడు రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన సినిమాల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక దర్శక ధీరుడు జక్కన్న ఇప్పటివరకు మొత్తం 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.
జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ తోనే రాజమౌళి సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. 2001లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా మూడు కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, బాక్స్ ఆఫీస్ వద్ద 12 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది.మళ్ళీ 2003లో జూనియర్ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా చేసిన రాజమౌళి 13 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా, 26 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
రాజమౌళి నితిన్ తో చేసిన సినిమా సై. రాజమౌళి కెరియర్ లోనే కాస్త తక్కువ ప్రాఫిట్ వచ్చినా సినిమా ఇది. ఈ సినిమాను ఐదు నుంచి ఆరు కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 9 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి చేసిన మొదటి సినిమా చత్రపతికి 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, ఈ సినిమా 20 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాకి 11 కోట్లు ఖర్చు చేయగా ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసింది.
యమదొంగ సినిమాను 18 కోట్లతో నిర్మించగా, సినిమా 28 కోట్లు వసూలు చేసింది. రామ్ చరణ్ తో మొదటిసారిగా రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా మగధీర సినిమాను 48 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత చిన్న బడ్జెట్ తో సినిమా తీయాలని సునీల్ తో మర్యాద రామన్న 14 కోట్లతో నిర్మించగా, ఈ సినిమా 29 కోట్లను వసూలు చేసింది.ఈగ సినిమాను 26 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా, ఈ సినిమా 42.3 కోట్లను వసూలు చేసింది.
రాజమౌళి ప్రభాస్ తో చేసిన సినిమా బాహుబలిని 136 కోట్లతో నిర్మించగా, బాహుబలి 600 కోట్లు వసూలు చేసింది. బాహుబలి రెండో భాగానికి 250 కోట్లు ఖర్చు చేయగా, బాక్సాఫీస్ వద్ద 1917 కోట్లు అందుకుంది.కొన్ని రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమాకు 450 కోట్లు ఖర్చు చేయగా,1152 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. జక్కన్న తాజాగా మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడని ఆ సినిమా ఎన్ని కోట్లు కలెక్షన్ రాబడుతుందో చూడాలి.