Rajaiah Vs Kadiyam : స్టేషన్ ఘన్ పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫ్రోటోకాల్ ప్రకారం సర్పంచ్‌లు పనుల కోసం తన దగ్గరకే రావాలన్నారు. తాను ఎమ్మెల్యే అయితే… కడియం శ్రీహరి ఎమ్మెల్సీ అని పేర్కొన్నారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ పదవి వచ్చి ఆరు నెలలే అయిందన్నారు. ఆయన మనోడే, తాను మనోడినేనంటూ హితవు పలికారు. కడియం శ్రీహరి, తాను నియోజకవర్గానికి రెండు కళ్లు అని రాజయ్య పేర్కొన్నారు. ఇద్దరిని రెండు కళ్ళలాగా చూసుకోవాలన్నారు. అలా కాదని ఒకవైపే చూస్తే కంటి చూపు పోతుందని హెచ్చరించారు. ఇటీవలే కడియం శ్రీహరి వర్గంలో పలువురు సర్పంచ్‌లు చేరడంతో రాజయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.
Rajaiah Vs Kadiyam : నువ్వు భార్యతో తన్నులు తిన్నోడివి..
Rajaiah Vs Kadiyam : ఇటీవలి కాలంలో తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరిల మధ్య పెద్ద వారే జరుగుతోంది. ఇద్దరూ మాజీ ఉప ముఖ్యమంత్రులే. అయినా తమ స్థాయిని మరిచి మరీ ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడికి దిగుతున్నారు. ‘నువ్వు భార్యతో తన్నులు తిన్నోడివి’ అని ఒకరంటే.. ‘ఒళ్లు దగ్గర పెట్టుకో’ అని ఒకరంటారు. వీరిద్దరి మధ్య పోరు తారాస్థాయికి చేరడంతో కేడర్ ఎవరి దగ్గరికి వెళితే ఎవరితో తంటో అని మిన్నకుండి పోవాల్సి వస్తోంది. నర్మగర్భంగా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే ఇద్దరు నేతలు.. రోజుకో అడుగు ముందుకేస్తున్నారు. ఒకరిపై ఒకరు వాగ్భానాలు వదలడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పోటాపోటీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు..
స్టేషన్‌ఘన్‌పూర్‌లో రెండు గ్రూపులుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాజయ్య, శ్రీహరిలు.. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారింది. సుమారు ఆరు నెలల కిందట మళ్లీ ఎమ్మెల్సీగా నియమితులైన కడియం శ్రీహరి స్టేషన్‌ఘన్‌పూర్‌లో కార్యకలాపాలను విస్తృతం చేశారు. ఇదే సమయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టికెట్ రాబోతుందన్న శ్రీహరి ప్రచారం కూడా చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రాజయ్య తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో స్టేషన్‌ఘన్‌పూర్ దళిత బిడ్డలు ఎక్కువగా చనిపోయారని రాజయ్య వ్యాఖ్యానించడం కొత్త వివాదానికి తెర తీసింది. అప్పటి నుంచి అగ్గి రగులుతూనే ఉంది. ఇప్పటికైనా గులాబీ బాస్ కలుగజేసుకుని ఈ వార్‌కు తెరదించాలని పార్టీ కేడర్ కోరుతోంది.