యువ హీరో కార్తికేయ నటించిన రాజా విక్రమార్క మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ మూవీలో కార్తికేయ ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కనిపించి అలరించారు మరి ఇప్పుడు ఆ మూవీ రివ్యూ గురించి చూద్దాం
ముందుగా ఈ మూవీ కథ విషయానికి వస్తే :
కొత్తగా ఎన్.ఐ.ఏ లో చేరిన కార్తికేయకు హోమ్ మినిస్టర్ రక్షణ బాధ్యతలు అప్పజెప్పారు.ఊహించని విధంగా హోమ్ మినిస్టర్ కూతురుని కిడ్నాప్ చేస్తారు.ఆమెను కిడ్నాప్ ఎవరు చేశారు?ఆమెను కార్తికేయ కాపాడాడా అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి.
ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే :
ఎన్.ఐ.ఏ ఆఫీసర్ గా కార్తికేయ అద్భుతంగా నటించాడు.తన కెరియర్ లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ గా చెప్పుకోవచ్చు.కార్తికేయ మేనరిజమ్స్,బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన తాన్య రవిచంద్రన్ పర్వాలేదనిపించింది. కీలక పాత్రలో కనిపించిన తనకెళ్ళ భరణి తన పాత్రకు తగిన న్యాయం చేశారు.హోమ్ మినిస్టర్ గా కనిపించిన సాయి కుమార్,ఇన్సూరెన్స్ ఏజెంట్ గా కనిపించిన హర్ష వర్ధన్ కూడా తమ పరిధిలో అద్భుతంగా నటించారు.
అనవసరమైన ట్విస్ట్ లు పెట్టడం మీద దర్శకుడు శ్రద్ధ పెట్టడం వల్ల మూవీ స్క్రీన్ ప్లే పూర్తిగా దెబ్బతింది.లాజిక్స్ అసలు సరిగ్గా లేవు, స్టోరీ లైన్ చాలా తికమకగా ఉంది.ఎడిటింగ్ ఇంకొద్దిగా బెటర్ గా ఉంటే బాగుండేది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్,సినిమాటోగ్రఫీ బాగున్నాయి.
భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ మొత్తానికి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.