Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రెండో వారం కెప్టెన్ గా రాజ్ ఎంపికయ్యాడు. హౌస్ లో అందరికంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకుని కెప్టెన్సీ ప్రక్రియలో గెలవడం జరిగింది. ఇదిలా ఉంటే రాజ్ ఆట తీరుని ఉద్దేశించి.. సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ తో ఆడియన్స్ పోలుస్తున్నారు. మేటర్ లోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో జెస్సి ఆట తీరు.. మాదిరిగానే ఈ సీజన్ లో రాజ్ గేమ్ ఉందని అంటున్నారు. ఇద్దరికీ చేయడం ఒకటి ఏమిటంటే జెస్సీ ఎక్కువగా మాట్లాడుతాడు..రాజ్ అంతగా మాట్లాడాడు.
సీజన్ ఫైవ్ లో జెస్సి మొదటి వారంలో ఇంటి సభ్యులందరి నెగిటివ్ ఇంప్రెషన్ తెప్పించుకున్నాడు. ఆ తర్వాత రోజురోజుకి ఆట తీరు మార్చుకుని హౌస్ లోనే చాలా స్ట్రాంగ్ ప్లేయర్ గా ఎదిగాడు. ఫిజికల్ టాస్క్ లలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించారు. మధ్యలో అనారోగ్యం రావడంతో… 9వ వారం నుండి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. ఫ్రెండ్షిప్ పరంగా జెస్సీ..సిరి, షణ్ముక్ తో వ్యవహరించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. హౌస్ లో అందరికంటే వీక్ అని స్టార్టింగ్ లో అందరు భావించిన గాని చివర ఆఖరికి చాలా స్ట్రాంగ్ గేమ్ ఆడుతు.. తోటి కంటెస్టెంట్ లకు మంచి పోటీ ఇచ్చాడు.
అనారోగ్యం కారణంగా అవసరం లేదు వెళ్ళిపోయినా కానీ..సీజన్ ఫైవ్ లో జెస్సి అందరి హృదయాలను గెలుచుకున్నాడు. సరిగ్గా ఇప్పుడు ఈ రీతిగానే రాజ్ ఆట తీరు ఉందని ఆడియన్స్ అంటున్నారు. రాజ్ స్టార్టింగ్ లో మొదటి వారం పెద్దగా ఓపెన్ కాలేదు. కానీ రెండవ వారం స్టార్టింగ్ నుండి నామినేషన్ సమయంలో గట్టిగా మాట్లాడటంతో పాటు టాస్కులు కూడా బాగా ఆడాడు. ఇంకా హౌస్ లో మంచి ఇంప్రెషన్ సంపాదించుకున్నాడు. దీంతో రెండోవారానికే కెప్టెన్ అయ్యాడు. ఆటపరంగా రాజ్.. సీజన్ ఫైవ్ లో జెస్సీని గుర్తు చేస్తున్నాడని జనాలంటున్నారు. పైగా ఈ ఇద్దరు కూడా మోడలింగ్ రంగం నుండి రావడం విశేషం.