భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన టీమ్ కు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.దానికి బిసిసిఐ కూడా ఓకే అనడంతో టీమ్ ను అన్నీ ఫార్మాట్స్ లో బలోపేతం చేయడానికి ద్రావిడ్ వేగంగా చర్యలు తీసుకుంటునారు.
వన్డే,టీ20 ల కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకోవడంతో నెక్స్ట్ కెప్టెన్ ఎవరని ప్రచారం తెర పైకి వచ్చింది.ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ పొజిషన్ కి రోహిత్ శర్మను ఫస్ట్ ఛాయిస్ గా రాహుల్ ద్రావిడ్ పరిగణిస్తారని సమాచారం.కానీ కొన్ని కథనాలు ప్రకారం రాహుల్ ద్రావిడ్ మూడు ఫార్మాట్స్ కు ముగ్గురు కెప్టెన్లను నియమించబోతున్నారని వన్డే సారథి రేసులో రోహిత్ తో కంటే సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ ముందంజలో ఉన్నారని సమాచారం.