Radhika: తెలుగుతో పాటు దక్షిణాదిలోని పలు భాషల్లో సినిమాలు చేసి అందరినీ ఆకట్టుకున్న అలనాటి హీరోయిన్ల జాబితాలో రాధిక ఉంటారు. ఆమె ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అప్పట్లో టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణలతో ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.
ఇప్పటికీ సినిమాలు చేస్తూ ఎంతో చలాకీగా ఉంటున్న రాధిక.. తాజాగా నందమూరి బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’ టాక్ షోకి వచ్చింది. ఈ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నకు రాధిక ఇచ్చిన సమాధానం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. తాను పని చేసిన ఓ హీరో బోరింగ్ అని.. ఓ మూలన కూర్చుంటాడని కామెంట్ చేసింది.
‘అన్ స్టాపబుల్2’ షోకి వచ్చిన రాధికను బాలయ్య ‘రజినీకాంత్ తో నువ్వు నటించావు కదా.. అతనిలో నీకు నచ్చనిది ఏంటి’ అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా రాధిక.. ‘తనొక పెద్ద బోరింగ్ పర్సన్.. ఎవరితో ఎక్కువ మాట్లాడడు.. తన పని అయిపోయిన తర్వాత ఓ మూలన కూర్చుంటాడు’ అని చెప్పింది. అయితే రాధిక చెప్పింది సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి.
Radhika
సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి గతంలో సినిమాలు చేసిన రాధిక.. ఆయనతో ఉన్న చనువు కొద్దీ ఇలాంటి కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. స్వభావ రిత్యా రజనీకాంత్ షూటింగ్ లో తన పని చేసుకుంటాడని, తన షాట్ అయిపోయాక ఓ పక్కకు వెళ్లి ఏదో ఒక బుక్ తీసి చదుకుంటూ ఉంటాడని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఆయన ఎవరితో పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడడనే విషయం అందరికీ తెలిసినా.. రాధిక ఇలా చెప్పడంతో అందరూ ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు.