Radhika Madan : బాలీవుడ్ నటి రాధికా మదన్ అత్యద్భుతమైన ఫ్యాషన్ వాది. గతంలో అనేక ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ ధరించి సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నలిచి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది. రాధికా మదన్ ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఆమె ఫ్యాషన్ డైరీస్ నుంచి వచ్చిన ఫోటోలు, వీడియోలతో నిండిపోయి ఉంటుంది. ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన అప్‌డేటెడ్ అవుట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ గోల్స్ ను అందిస్తుంటుది. క్యాజువల్ లుక్ నుంచి ఫెస్టివ్ అవుట్ ఫిట్స్ వరకు అన్నింటిని ఈ బ్యూటీ ధరిస్తూ ఫ్యాషన్ తో ప్రయోగాలు చేస్తుంటుంది. ఈమె అనుసరించే లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ ఫ్యషన్ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటాయి.

Radhika Madan : తాజాగా రాధికా ఓ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం వేసుకున్న అవుట్‌ఫిట్ అందరిని అమితంగా ఆకర్షించింది. ఫ్యాషన్ డిజైనర్ హౌజ్ మాలీకి మ్యూజ్ గా వ్యవహరించిన రాధికా తన ఫోటో షూట్ కోసం బ్రైట్ పింక్ కలర్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది. డ్రమాటిక్ నెక్‌లైన్, ఫ్రిల్ డీటయిల్స్ తో ఆఫ్ షోల్డర్ స్టైల్ లో వచ్చిన పొట్టి గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది రాధికా. ఈ టైట్‌ఫిట్ డ్రెస్‌లో తన ఒంపుసొంపులను చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొట్టింది.

ఈ అవుట్‌పిట్‌కు ట్రాన్స్‌పరెంట్ గా యాంకిల్ స్ట్రాప్స్, వైట్ డీటెయిల్స్ తో వచ్చిన ఫుట్‌వేర్‌ను వేసుకుని అదరగొట్టింది. రాధికా వేసుకున్న ఈ అట్రాక్టివ్ అవుట్‌ఫిట్ ధర 30వేల రూపాయలట. ఈ అవుట్‌ఫిట్ డిజైనర్ మాలీ వెవబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

పింక్ కలర్ అవుట్‌ఫిట్ కు మ్యాచింగ్‌గా చెవులకు గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది రాధికా. ఈ ఇయర్ రింగ్స్‌ను బ్లింగ్ థింగ్ స్టోర్ షెల్ఫ్ నుంచి సేకరించింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రాధికాకు స్టైలిష్ లుక్స్ ను అందించింది. తన కురులను సైడ్ పాపిట తీసుకుని లూజ్‌గా వదులుకుంది రాధికా. మినిమల్ మేకప్ లుక్స్ లో మెస్మరైజ్ చేసింది ఈ పింక్ బ్యూటీ. కనులకు ఐ లైనర్, మస్కరా వేసుకుని ఐబ్రోస్‌ని హైలెట్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని ఫ్యాషన్ లవర్స్ ను తన లుక్స్‌తో అట్రాక్ట్ చేసింది.
