Radhika Madan : టొరాంటో వీధుల్లో మంటలు రేపుతోంది రాధిక మదన్ . టొరాంటో అంతర్జాతీయ చిత్ర వేడుకలలో భాగంగా అదిరిపోయే అవతారంలో ఈ చిన్నది రెచ్చిపోయింది. బ్లాక్ దుస్తులను ధరించిన ఈ భామ షర్ట్ వేసుకోవడం మరిచిపోయింది. కాదు కాదు కావాలనే వేసుకోలేదు. తన లేలేత పాలమీగడలాంటి అందాలను తాను నటించిన కచ్చే లింబూ సినిమా వరల్డ్ ప్రీమియర్ షో కోసం . ఈ షర్ట్ లెస్ బ్లాక్ అవుట్ ఫిట్ ను ధరించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది ఈ భామ.

Radhika Madan : టొరాంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అద్భుతమైన ఫ్యాషన్ మూమెంట్స్ ప్రతిరోజు కనువిందు చేస్తున్నాయ్. రాధిక మదన్ కూడా ఈ వేడుకకు తన గ్లామర్ లుక్స్ తో మరింత కలర్ ని అందింది. రాధిక మదన్ నటించిన కచ్చే లింబూ చిత్రం ఈ ఫెస్టివల్ లో అనేక ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో రాధిక విన్నింగ్ మూమెంట్ చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు. ఈ వేడుక కోసం ఆమె ధరించిన అవుట్ ఫిట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. షర్ట్ వేసుకోకుండానే బ్లాక్ క్రాప్ బ్లేజర్ ధరించి దానికి మ్యాచింగ్ గా ప్యాంట్ వేసుకొని టొరాంటో వీధుల్లో విహరించింది ఈ చిన్నది. ఈ డ్రెస్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్లో షేర్ చేసింది రాధిక. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Radhika Madan : ఇవే పిక్స్ ను రాధిక మదన్ స్టైలిస్ట్ అమన్ దీప్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఫాన్స్ ఆమెను పొగడ్తలతో ముంచేశారు. నువ్వు ఇంత హాట్ గా ఉండడం నాట్ ఫెయిర్ అంటూ మరికొంతమంది కామెంట్ చేశారు. ఇన్ బాక్స్ మొత్తం హార్ట్ సింబల్స్ తో నిండిపోయింది. ఇంకొంతమంది షర్ట్ లేకుండా తిరిగేస్తోంది ఇదేం ఫ్యాషన్ రా బాబు అంటూ తలలు పట్టేసుకుంటున్నారు.

ఇక అవుట్ ఫిట్ విషయానికొస్తే ఈ డిజైనర్ పీస్ ను ప్రముఖ డిజైనర్ నీతూ లుల్లా రూపొందించారు. ఈ షర్ట్ లెస్ లుక్ మరింత ట్రెండీగా కనిపించేందుకు రాధిక తన మెడలో స్లీక్ గోల్డ్ లేయర్డ్ చైన్ వేసుకుంది. దానితో పాటుగానే చైన్ లింక్ చోకర్ నెక్లెస్ ధరించింది. చేతివేళ్ళకు స్టేట్మెంట్ రింగ్స్ పెట్టుకుంది. స్మోకి కళ్లతో , కను రెప్పలకు స్లీక్ ఐ లైనర్ పెట్టుకుని, పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది ఈ చిన్నది.