ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ద్వారా ఎంతో మంది హీరోయిన్స్ వెండితెరకి పరిచయం అయ్యారు. స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. ఆరంభంలో కుటుంబ కథా చిత్రాలు చేసిన కోడి రామకృష్ణ తరువాత గ్రాఫిక్స్ ప్రధానమైన చిత్రాలు చేస్తూ వచ్చారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుందతి సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉంటే ఆయన దర్శకత్వంలో చివరిగా అవతారం అనే సినిమా వచ్చింది. సత్యసాయి బయోపిక్ షూటింగ్ జరుగుతూ ఉండగానే ఆయన చనిపోయారు.
ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన వచ్చిన అవతారం మూవీలో కన్నడ భామ రాధిక హీరోయిన్ గా నటించింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి ఆమె రెండో భార్య. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ఆమె కుమారస్వామిని వివాహం చేసుకుంది. తరువాత ఆమె విడాకులు తీసుకుంది. గత కొంత కాలంగా మరల సినిమాలలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మూవీస్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అందులో ఒకటి యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫాంటసీ థ్రిల్లర్ మూవీ కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈ మధ్య ఈ బ్యూటీ బాడీ వర్క్ అవుట్స్ మొదలు పెట్టింది.
అలాగే జిమ్ లో విపరీతంగా కసరత్తులు చేయడంతో పాటు డాన్స్ లు కూడా చేస్తూ ఉంది. ఇక తాజాగా ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ బ్యాలెన్స్ తప్పి క్రింద పడిపోయింది. దీంతో ఆమెకి దెబ్బలు తగిలినట్లు తెలుస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం బిడ్డకి తల్లి ఆయన ఈ బ్యూటీ మళ్ళీ ఫుల్ స్లిమ్ లుక్ లో తిరిగి సినిమాలో కనిపంచాలని అనుకుంటుంది. దీనికోసమే ఈ బ్యూటీ ఓ వైపు డాన్స్ లు చేస్తూ, మరో వైపు కసరత్తులు చేస్తూ కష్టపడుతుంది. మరి ఈమె ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయి అనేది చూడాలి.