Radhika Apte : బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రేస్ రాధిక ఆప్టే తన అప్ కమింగ్ మూవీ కోసం ఆధరగొట్టే అవుట్ ఫిట్ తో అట్రాక్ట్ చేస్తోంది. విక్రమ్ వేద ప్రమోషన్ కోసం ఈ బ్యూటీ సాక్షి అండ్ కిన్ని డిజైన్ చేసిన డిజైనర్ ప్రింటెడ్ స్కర్ట్ ను ధరించి అందరిని మెస్మరైజ్ చేసింది. ఈ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. అమ్మడు కైపెక్కించే కళ్ళతో దాగనంటున్న అందాలతో తన సోయగాల విందును పరిచి కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

Radhika Apte : వైవిధ్యమైన నటనతో అద్భుతమైన టాలెంట్ తో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటి రాధిక ఆప్టే. ఈ అమ్మడు మరోసారి విక్రమ్ వేదా సినిమాతో తన టాలెంట్ చూపించి అలరించేందుకు సిద్ధమైంది. మూవీ ప్రమోషన్స్ లో కాస్త ఆలస్యమైనా తన కో స్టార్ హృతిక్ రోషన్ తో ప్రమోషన్స్ లో పాలుపంచుకుంటూ తనదైన క్రేజ్ ను తీసుకొస్తుంది ఈ బ్యూటీ. తాజాగా జరిగిన ప్రమోషన్స్ లో బోహో చిక్ ప్రింటెడ్ స్కర్ట్ సెట్ వేసుకొని అందరి చూపులు తనవైపు తిప్పుకుంది రాధిక.

Radhika Apte : స్ట్రాపి క్రాప్ టాప్, దాని దానికి జోడిగా భారీ ఫ్రిల్స్ ఉన్న స్కర్ట్ వేసుకుని ఎంతో అందంగా కనిపించింది ఈ సుందరి. ఈ అవుట్ ఫుట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులు ఆమె లుక్స్ కు ఫిదా అయిపోయారు. ఈ అందమైన అవుట్ ఫిట్ను డిజైనర్ హౌస్ సాక్షి అండ్ కిన్ని నుంచి సేకరించింది. తన బొహో లుక్ కు ఎత్నిక్ టచ్ ఇచ్చేందుకు రాధిక ఆప్టే తన చెవులకు భారీ ఝంకా సెట్ ను చెవులకు అలంకరించుకుని, నుదుటున బొట్టు పెట్టుకుంది. నాచురల్ మేకప్ లో ఎంతో క్యూట్ గా కనిపించింది బ్యూటీ.

అంతకుముందు రాధికా ఆప్టే చేతితో నేయబడిన బ్రోకేడ్ సెట్ వేసుకుని ట్రెడిషనల్ లుక్ లో ఎంతో అందంగా కనిపించింది. ఈ పట్టు లంగా పరికిణిలో అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించి కుర్రాలని ఇంప్రెస్ చేసింది.