Radhika Apte : కాంట్రవర్సీలతో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరోయిన్‌లలో బోల్డ్ స్టార్ రాధికా ఆప్టే ఒకరు. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిరంతరం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌ను పెడుతూ యమ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్స్‌ను అట్రాక్ట్ చేస్తుంటుంది. సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను, వ్యక్తిగత ఫోటోలు, మ్యాగజిన్‌ల కోసం చేసే హాట్ హాట్ ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంటుంది. తాజాగా ఓ బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి అందాలను ఆరబోసి కుర్రాళ్లకు సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Radhika Apte : సినిమా ప్రమోషన్ అయినా లేదా రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా ప్రతి సందర్భంలోనూ నలుపు రంగు దుస్తులు ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది సినీ తారలు, సెలబ్రిటీలు బ్లాక్ అవుట్‌ఫిట్స్‌ను ఎన్నుకుంటుంటారు. తాజాగా బోల్డ్ స్టార్ రాధిక ఆప్టే కూడా త్వరలో విడుదల కానున్న విక్రమ్ వేధా సినిమా ప్రమోషన్‌లో భాగంగా బ్లాక్ అవుట్ ఫిట్ ను వేసుకుని కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. కో-ఆర్డ్ సెట్ ధరించి యూత్‌ను కన్‌ఫ్యూజ్ చేసింది. స్లీవ్ లెస్, డీప్ నెక్‌లైన్ , బ్రాడ్ స్ట్రాప్స్‌తో వచ్చిన నలుపు రంగు బ్రాలెట్ టాప్ వేసుకుని దానికి జోడీగా హై వెయిస్ట్ బ్లాక్ ట్రౌజర్‌ను ధరించింది. ఈ అవుట్‌ఫిట్‌కు ఫిట్ అయ్యే విధంగా నలుపు రంగు హీల్స్, మెడలో వరుసలు కలిగిన బంగారు గొలుసు వేసుకుని తన అందంతో అందరిని చంపేసింది.

గతంలోనూ ఈ భామ గోవాలో సముద్ర తీరంలో జలకన్యలా ఫోజులు ఇస్తూ దిగిన హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ హల్ చల్ చేశాయి. అమ్మడు ధరించిన రంగు రంగుల కాయిన్స్ డ్రెస్ కుర్రాళ్ల చూపు తిప్పుకోనీయకుండా చేశాయి. ఈ అవుట్‌ఫిట్ వేరే లెవెల్ అంటూ నెటిజెన్లు కామెంట్ల వర్షం కురిపించారు.

Radhika Apte : బోల్డ్ పాత్రల్లో నటించి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడమే కాదు. ఫ్యాషన్ దుస్తులను ధరించి తన ఫ్యాన్స్ మనసు దోచేయగలదు ఈ అందాల భామ. ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే ప్రముఖ మ్యాగజిన్‌లకు హాట్ హాట్ ఫోటో షూట్‌లు చేస్తుంటుంది. అమ్మడి పాపులారిటీ అలాంటిది మరీ. అందులోనూ అందాలు ఆరబోస్తూ ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ సుందరి.