Radhika Apte : కాంట్రవెర్సీ మాటలతోనే కాదు బోల్డ్ ఫోటో షూట్లతోనూ బాంబు పేల్చగలదు బాలీవుడ్ బోల్డ్ స్టార్ రాధికా ఆప్టే . ఈ భామ మీడియా ముందుకు ఎప్పుడు వచ్చినా మసాలా లాంటి ముచ్చట్లను మోసుకు వస్తుంది. లేటెస్ట్ గా త్వరలో విడుదల కానున్న తన మూవీ విక్రమ్ వేద కి సంబంధించిన ప్రమోషన్ లలో ఈ భామ తలమునకలైనది. ప్రమోషన్ లలో భాగంగా ట్రెండీ దుస్తులను ధరించి వింటర్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. పర్పుల్ కలర్ అవుట్ ఫిట్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉన్నాయ్.

Radhika Apte : బోల్డ్ క్యారెక్టర్స్ తో అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ తో సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది రాధికా ఆప్టే . ఇండస్ట్రీలోనే కాదు సోషల్ మీడియా లోనూ రాధికకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో రాధికకు 3.7 మిలియన్ ల ఫాలోవెర్స్ ఉన్నారు. అందుకే ఈ భామ తన ఫాలోవెర్స్ ను ఇంప్రెస్స్ చేసేందుకు ఎప్పుడూ ఇన్ స్టాలో ఆక్టివ్ గా ఉంటుంది.

లేటెస్ట్ గా విక్రమ్ వేద ప్రొమోషన్స్ కోసం రాధికా హాట్ అవుట్ ఫిట్ వేసుకుని అందరికి చెమటలు పట్టించింది. ట్రెండీ కో ఆర్డ్ సెట్ వేసుకుని కుర్రాళ్లను కన్ఫ్యూజ్ చేసింది. వైట్ కలర్ టాప్ , పర్పుల్ కలర్ ప్యాంటు వేసి తన అందాలను స్పష్టంగా చూపించి హీట్ పెంచింది.

ఫుల్ స్లీవ్స్ నెక్ కవర్ టాప్ , హై వెయిస్ట్ ప్యాంటు వేసుకుని చేతిలో లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ పట్టుకుని క్యూట్ స్మైల్ తో దిగిన పిక్ ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. ఈ పిక్ కింద ఫాలోవర్స్ క్రేజీ కామెంట్స్ చేసారు. ఫైర్ , హార్ట్ సింబల్స్ తో ఇన్ బాక్స్ నిండిపోయింది. వీలు కుదిరితే నాతో ఓ కాఫీ కి వస్తావా అంటూ ఓ అభిమాని కామెంట్ చేసాడు . మరో ఫ్యాన్ నాకు ఓ ఐ ఫోన్ కోనివ్వు అని అడుగుతున్నాడు.

ఈ మధ్యనే రాధికా ఓ అండర్ వాటర్ ఫోటో షూట్ చేసింది. చేతికి వాచ్ పెట్టుకుని జలకన్యలా దిగిన ఈ ఫోటో కూడా నెట్ లో వైరల్ అవుతోంది.

ఆ మధ్య సీక్విన్ డీటెయిల్స్ తో వచ్చిన కో ఆర్డ్ సెట్ వేసుకుని తన అందాలతో అందరిని మెస్మరైజ్ చేసింది రాధికా . స్ట్రాప్ లెస్ బ్రా వేసుకుని దానికి మ్యాచ్ అయ్యే ప్యాంటు ధరించింది. బ్రా పైనుంచి కోట్ వేసుకుని స్టైలిష్ లుక్స్ తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తోంది.
