బాహుబలి,సాహో తరువాత వస్తున్న ప్రభాస్ తదుపరి చిత్రం రాధే శ్యామ్ ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది.జిల్ ఫేం రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ ఇంట్రడక్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ టీజర్ ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ ఈ మూవీకి సంబంధించిన వార్త ఒకటి బాగా వైరల్ అవుతుంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఈ మూవీ నుండి పూజ హెగ్డే ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ప్లాన్ లో చిత్ర యూనిట్ ఉందట.ఈ టీజర్ ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.