జిల్ ఫేం రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్నది.ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 23వ తేదీన గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఈ ఈవెంట్ కు అభిమానులే చీఫ్ గెస్ట్ లని మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు.
ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్,సలార్,ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు.ఈ చిత్రాలే కాకుండా ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.