జిల్ ఫేం రాధ కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీ వచ్చే నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది.ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో వెనక్కి తగ్గకుండా మూవీ యూనిట్ ముందుగా అనౌన్స్ చేసిన డేట్ కే ప్రేక్షకుల ముందుకు వెళ్ళడానికి సిద్ధమైంది.ఆర్.ఆర్.ఆర్ మూవీ యూనిట్ చేసినంత వేగంగా ప్రమోషన్స్ చేయడంలో రాధే శ్యామ్ మూవీ వెనక పడింది.
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ప్రమోషన్స్ ను జనవరి 7 నుండి ప్రారంభించబోతున్నారు.మూవీ యూనిట్ దేశవ్యాప్తంగా ఉన్న మీడియా ప్రతినిధులతో నిర్వహించే ప్రెస్ మీట్ లలో ప్రభాస్ స్వయంగా పాల్గొంటారని సమాచారం.