జిల్ ఫేం రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్,పూజ హెగ్డే జంటగా నటిస్తున్న రాధేశ్యామ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.రెండు వందల కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ విక్రమాదిత్యగా,పూజ ప్రేరణగా కనిపించనున్నారు.తాజాగా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
దాని ప్రకారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ ఈ నెల 10వ తేదీన విడుదల చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాల్సివుంది.