Raashi Khanna : మంచి హైట్, హైట్ కు తగ్గ పర్సనాలిటీ. క్యూట్ పేస్ , బాబ్లీ ఫిగర్ తో సినిమా రంగంలో తన నటనతో , గ్లామర్ తో అయస్కాంతంలా అందరిని ఆకట్టుకుంటోంది సౌత్ బ్యూటీ రాశి ఖన్నా. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు చాలా కష్టపడుతుంది ఈ చిన్నది . అద్భుతమైన ఆఫర్స్ ను అందిపుచ్చుకున్నా పెద్దగా హిట్ లు ఈ భామ ఖాతాలో లేకపోవడం తో రీసెంట్ గా రాశి తన రూట్ ను మార్చింది. సమయంతో పాటు తనను తాను అప్‌డేట్ చేసుకునే దిశగా పనిచేస్తుంది. ఈ మధ్య కాస్త బక్కచిక్కిన రాశి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకునేందుకు బోల్డ్ దుస్తుల్లో తనని తాను హాట్ గా చూపించుకునే పనిలో పడిపోయింది.

ఓ వైపు అందివచ్చే సినిమా అవకాశాలను దక్కించుకుంటూనే మరోవైపు హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియా ను షాక్ చేస్తోంది రాశి. తాజాగా షోల్డర్-డ్రాప్ కట్‌తో వచ్చిన నలుపు రంగు అవుట్ ఫిట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది.

సోషల్ మీడియా లో రాశి కి ఈ మధ్యన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ భామ ఏ పిక్ పోస్ట్ చేసిన నిమిషాలలో లైకులు, షేర్ ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం చేసిన ఈ బ్లాక్ డ్రెస్ పిక్స్ ని తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. రాశి ఖన్నా అభిమానులు ఆమె అందాలను పొగడ్తలతో ముంచేస్తున్నారు.

ఓ ఫోటో షూట్ కోసం ఈ ట్రెండీ బ్లాక్ అవుట్ ఫిట్ ను ధరించింది రాశి. ఈ డ్రెస్ కు తగ్గట్లుగా మేకోవర్ అయ్యింది. కనులకు ఐ లైనర్, మస్కారా, న్యూడ్ పింక్ ఐ షేడ్ వేసుకుని , బుగ్గలను హైలెట్ చేసింది. పేదలకు పింక్ లిప్ స్టిక్ పెట్టుకుని తన గ్లామరస్ లుక్స్ తో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

టాలీవుడ్ కు కాస్త బ్రేక్ ఇచ్చిన రాశి ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ మధ్యనే రుద్ర- ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ అనే మూవీ తో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్‌లో అరంగేట్రం చేసింది. ఈ మూవీ కి గాను రాశి ఖన్నా కు ది బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ నెగెటివ్ రోల్ అవార్డును గెలుచుకుంది. నిజానికి వెబ్ సిరీస్‌లో ఆమె పాత్రకి నిజ జీవితంలో ఆమె పాత్రకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం హిందీ లో ఈ భామ యోధాలో నటించబోతోంది.
