Raashi Khanna : తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది రాశీ ఖన్నా. 2013లో మద్రాడ్ కేఫ్ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా తెలుగు లో నటించిన ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారానే రాశీ పాపులర్ అయ్యింది. ఆ తరువాత బెంగాల్ టైగర్, సుప్రీమ్, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండుగే, తిరు, సర్దార్ వంటి ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించింది రాశీ.

Raashi Khanna : లేటెస్ట్‌గా పక్కా కమర్షియల్, థాంక్యూ వంటి చిత్రాల్లోనూ తనకొచ్చిన నటన, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరించే ప్రతయ్నం చేసింది . అయితే ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అమ్మడి నసీబ్ మాత్రం మారడం లేదు.

దీంతో రూటు మార్చి మరో సైడ్ నుంచి నరుక్కొస్తోంది ఈ బ్యూటీ. బొద్దుగా ఉండటం వల్లే ఇబ్బందులు వస్తున్నాయనుకుని తన పర్సనాలిటీపై దృష్టిసారించింది రాశీ. ఇప్పుడు బొద్దుగా ఉన్న రాశీ కాస్తా చక్కనమ్మలా చిక్కిపోయింది. తన తాజా ఫోటో షూట్ పిక్సే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి.

కెరీర్ ప్రారంభంలో ఉన్న రాశీకి ఇప్పుడున్న రాశీకి చాలా తేడాలు ఉన్నాయి. తన అందాన్ని మరింత రెట్టింపు చేసి సోషల్ మీడియా వేదికగా ఫ్యాషన్ స్టైల్స్‌తో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసే పనిలో పడిపోయింది ఈ చిన్నది. లేటెస్ట్‌గా రాశీ ఖన్నా ఆర్గాంజా అనార్కలీ సూట్ వేసుకుని అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. లైట్ పింక్, లైట్ బ్లూ, లెమెన్ ఎల్లో రంగుల హ్యాండ్ పెయింటెడ్ ప్యూర్ సిల్క్ ఫ్లేర్డ్ కుర్తా , ప్యాంట్ వేసుకుంది. కుర్తాను మ్యాచింగ్‌గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ గోటా వర్క్‌తో వచ్చిన ఆర్గాంజా దుపట్టాను వేసుకుంది.

ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను పిచ్చికా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుని అద్భుతమైన ఫోటో షూట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది రాశీ. ఫ్యాషన్ స్టైలిస్ట్ జుకల్కర్ రాశీకి స్టైలిష్ లుక్స్‌ను అందించాడు.

రీసెంట్‌గా సర్దార్ ప్రమోషన్ కోసం పింక్ కలర్ నెట్టెడ్ చీర కట్టుకుని తన సొగసులను పరిచింది రాశీ. కవితా గుత్తా అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి స్టన్నింగ్ ఎంబ్రాయిడరీ శారీని ఎన్నుకుంది. పూల డిజైన్స్‌తో లేస్ వర్క్‌తో వచ్చిన వీ నెక్‌లైన్ కలిగిన బ్లౌజ్ వేసుకుని చీరను సంప్రదాయకంగా కట్టుకుని కుర్రాళ్ల మనసు దోచేసింది రాశీ ఖన్నా.

చీర లుక్ కు తగ్గట్లుగా మెడలో చోకర్ నెక్‌లెస్ పెట్టుకుంది. పెదాలకు డార్క్ పింక్ లిప్ స్టిక్ వేసుకుని కనులకు ఐలైనర్, మస్కరా దిద్దుకుని స్టైలిష్‌గా హెయిర్‌ను మలచుకుని కెమెరాకు వయ్యారంగా పోజులు ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రాఫిక్ జామ్ చేసింది ఈ సుందరి.

అంతకు ముందు ఓ ఫోటో షూట్ కోసం మహిమా మహాజన్ అఫీషియల్ ఫ్యాషన్ లేబుల్ నుంచి అందమైన అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుని అదరగొట్టింది రాశీ ఖన్నా. విభిన్న ప్రింట్స్‌తో డిజైన్ చేసిన రెడ్ కరల్ అనార్కలీ సూట్ ను వేసుకుని కెమెరాకు హాట్ లుక్స్‌ను అందించి రెచ్చిపోయింది రాశీ ఖన్నా.

సోషల్ మీడియాలో ఈ పిక్స్‌ను పోస్ట్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా స్టైలిష్ లుక్స్‌ను అందించాడు జుకల్కర్.
