Raai Lakshmi : సౌత్ సెన్సేషన్ స్టార్ రాయ్ లక్ష్మి తన అవుట్ స్టాండింగ్ లుక్స్ తో అందరినీ మెస్మరైస్ చేస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాయ్ లక్ష్మి తన అప్ డేటెడ్ ఫొటోస్ ను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని ఇంప్రెస్ చేస్తుంది. తాజాగా దుబాయ్ లో ఓ ఈవెంట్ కోసం వెళ్ళిన రాయ్ లక్ష్మి అదిరిపోయే డ్రెస్ వేసుకొని అందరి దృష్టిని ఆకట్టుకుంది. డార్క్ బ్లూ కలర్ లో వచ్చిన షార్ట్ మిడి స్కర్ట్ లో తన థైస్ అందాలని చూపిస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతున్నాయి .

Raai Lakshmi : ఫ్యాషన్ డిజైనర్ సాయిషా షిండే కలెక్షన్స్ నుంచి ఈ అద్భుతమైన అవుట్ ఫిట్ ను సేకరించింది రాయ్ లక్ష్మి. రాయల్ లుక్ లో ఉన్న ఈ అవుట్ ఫిట్ లో రాయ్ లక్ష్మి మెరిసిపోయింది. కాలర్ నెక్ తో వచ్చిన టాప్ కి డ్రామాటిక్స్ స్లేవ్స్ ఇచ్చారు డిజైనర్. దీనికి జోడిగా షార్ట్ స్కర్ట్ ను వేసుకుంది. బ్యాక్ సైడ్ ఇచ్చిన ఎక్స్ట్రా పీస్ సరికొత్త లుక్ ని అందించింది.

నటిగా తెలుగు , తమిళ , మలయాళ సినిమాల్లో రాయ్ లక్ష్మి కి మంచి ఫాలోయింగ్ ఉంది. హిందీలోనూ ఓ మూవీ చేసి అక్కడ తన అందాలతో హల్ చల్ చేసింది. ఇలా వివిధ ఇండస్ట్రీలో 50 కి పైగా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

కాంచనమాల కేబుల్ టీవీ తో తెలుగు తెరకు పరిచయమైంది రాయ్ లక్ష్మి. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో తప్ప మరో సినిమాలో కనిపించలేదు. బలుపు, సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ no 150 సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసి తన గ్లామర్ తో సందడి చేసింది.

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తనకంటూ క్రేజ్ ను సంపాదించుకుంటుంది రాయ్ లక్ష్మి. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అంతకుముందు కూడా ఇలాంటి అద్భుతమైన దుస్తులు ధరించి తన అందాలతో రెచ్చగొట్టింది ఈ బ్యూటీ.