Python Viral Video: పట్టణీకరణ పుణ్యమా అని మనం అడవులని ఆక్రమించేస్తున్నాం. వాటి ఆవాసాలు కరిగి పోవడంతో అడవి మృగాలు మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో అడవి మృగాలు ఇళ్ళ దగ్గరికి రావడం మహారాష్ట్రలో చూశాం. చిరుతలు,పులులు ఇళ్లలోకి రావడమే కాకుండా ఇంట్లో పెంపుడు జతువులను కూడా ఎత్తుకెళ్ళాయి . ఇలాంటి సందర్భాల్లో వాటిని మనం తప్పుపట్టలేం ఎందుకంటే తప్పు మనవైపున కూడా ఉంది కాబట్టి.
అడవి మృగాలే కాదు,అప్పుడప్పుడూ సర్పాలు కూడా మన జనావాసాల్లోకి వస్తుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. భారీ సైజులో ఉండే సర్పాన్ని చూస్తే అందరికి పై ప్రాణాలు పైనే పోయాయి. ఎలాంటి దుర్ఘటన జరగలేదు. సమయానికి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ భారీ సర్పాన్ని పట్టుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల్లోకి వెళితే,ఒక పబ్లిక్ స్కూల్ కి చెందిన బస్ లోకి ఒక పెద్ద కొండ చిలువ (Python) చేరింది. బస్ లో ఉన్న కొండ చిలువ (Python) ని గమనించిన డ్రైవర్ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వేంటనే స్పందించిన అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆ భారీ సర్పాన్ని పట్టుకున్నారు. భారీ సైజులు ఉండే సర్పాన్ని బంధించే దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Python Viral Video:
స్కూల్ కి సెలవు కావడంతో డ్రైవర్ బస్ ని తన ఇంటికి తీసుకునివెళ్ళి పక్కనే పార్క్ చేశాడని, అక్కడే కొండ చిలువ బస్ లోకి వచ్చినట్టుగా అనుమానిస్తున్నారు.కొండచిలువ ని గుర్తించినప్పుడు పిల్లలు లేకపోవడం మంచిదైందని స్థానికులు చెప్తున్నారు. ఎలాగైనా ఆ సర్పాన్ని పట్టుకున్నారని. సకాలంలో స్పందించిన అటవీ అధికారులను మెచ్చుకుంటున్నారు.ఒకసారి మీరు కూడా ఈ భారీ సర్పాన్ని ఒక లుక్కేయండి.
A python rescued from a school bus in Raibareli, UP pic.twitter.com/lN1LfIW4ic
— Sanat Singh (@sanat_design) October 16, 2022