PV Sindu: భారత కీర్తి పతాకాలను విదేశీ గడ్డ మీద గర్వంగా ఎగరేసిన క్రీడాకారుల జాబితాలో మన తెలుగు బిడ్డ పీవీ సింధు కూడా ఉంటుంది. బ్యాడ్మింటన్ లో రాకెట్ పట్టుకొని శివంగిలో రెచ్చిపోయి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించి, ఎన్నో టైటిల్స్, అవార్డులను అందుకుంది. బ్యాడ్మింటన్ లో వరల్డ్ క్లాస్ ప్లేయర్ల జాబితాలో పీవీ సింధు చోటు సంపాదించుకుంది.
తెలుగు తేజమైన పీవీ సింధు కేవలం గ్రౌండ్ లో రాకెట్ పట్టుకొనే కాదు.. అప్పుడప్పుడు పలు టీవీ ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఈటీవీలో వచ్చిన ‘అలీతో సరదాగా’ షోకు వచ్చిన పీవీ సింధు.. తనకు సంబంధించిన చాలా విషయాలను పంచుకుంది. తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే బోనాల పండుగ సందర్భంగా లంగావోణిలో, బోనంతో అందరినీ ఆకట్టుకుంది.
మ్యాచులు లేనప్పుడు, అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం పీవీ సింధు.. సోషల్ మీడియాలో అదరగొడుతూ ఉంటుంది. తనకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ గా డ్యాన్స్ లు కూడా చేస్తుంటుంది. ఈ అమ్మాయి తాజాగా ‘జిగిల్ జిగిల్’ పాటకు చీర కట్టులో, అదిరిపోయే స్టెప్పులతో దుమ్మురేపింది.
PV Sindu:
అందమైన చీర కట్టులో, కాళ్లకు షూతో.. స్టైలిష్ డ్యాన్స్ స్టెప్పులతో పీవీ సింధు దుమ్మురేపింది. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఈ వీడియోను తెగ మెచ్చుకుంటున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్ లాగా మారిపోయిన సింధు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అంతకు ముందు కచ్చా బాదమ్, అరబిక్ కుతు సాంగ్‌కి డ్యాన్స్ ఇరగదీసి.. వార్తల్లో నిలిచింది.
View this post on Instagram