ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్ససిన అవసరం లేదు. క్రీడాకారిణిగా తాజాగా కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలుచుకున్న సింధు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటుంది. ఇక క్రీడాకారిణిగా ఆమెకున్న గుర్తింపుతో హీరోయిన్ స్థాయిలో సెలబ్రెటీ స్టేటస్ ని ఆశ్వాదిస్తుంది. ఈ నేపధ్యంలో అలీతో ఇంటర్వ్యూలో ఆమె పాల్గొంది. దీనికి సంబందించిన ప్రోమో సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలని ఆమె పంచుకుంది. హీరో ప్రభాస్ అంటే తనకు ఇష్టమని సింధు చెప్పుకొచ్చింది. అలాగే ప్రభాస్ తనకు మంచి ఫ్రెండ్ అని కూడా పేర్కొంది.
పథకం గెలుచుకున్న సమయంలో జాతీయ గీతం వినిపిస్తూ ఉంటే, చేతిలో జాతీయ పతాకం పట్టుకొని నిలబడితే ఆ సమయంలో తీరమైన భావోద్వేగానికి లోనవుతానని, అలాంటి సిచువేషన్స్ గూస్ బాంబ్స్ కలిగిస్తాయని చెప్పుకొచ్చింది. అందరిలా సినిమాలకి, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా రాలేదని, వారందరి కంటే తానే ఎక్కువగా విదేశాలలో తిరుగుతూ ఉంటాను కాబట్టి ఆ ఫీలింగ్ రాలేదని చెప్పుకొచ్చింది. అలాగే గోపీచంద్ అకాడమిలో ఆటని నేర్చుకున్న కూడా అక్కడ కొని పరిస్థితితులు తనకి నచ్చలేదని అందుకే బయటకి రావాల్సి వచ్చిందని చెప్పింది.
అయితే గోపీచంద్ అకాడమీలో ఎలాంటి ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే పూర్తి వివరాలు పూర్తి ఇంటర్వ్యూలో తెలిసే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అంటే ఉండొచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అది కూడా తన బయోపిక్ ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పింది. దీనిని బట్టి పీవీ సింధు బయోపిక్ త్వరలో ఉండే అవకాశం ఉందనే విషయం స్పష్టం అయ్యింది.