విజయ దేవరకొండ బాగా ప్రమోట్ చేసిన పుష్పక విమానం మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఆ మూవీ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా విషయానికి వస్తే :
సుందర్ (ఆనంద్ దేవరకొండ) భార్య గీత సైని లేచిపోతుంది.అది అందరికీ తెలిస్తే పరువుపోతుందని భావించిన సుందర్ అది ఎవరికి తెలియకుండా ఉండడం కోసం నానాపాట్లు పడుతుంటాడు.అసలు సుందర్ భార్య ఎందుకు లేచిపోయింది దాని వెనక ఉన్న కథ ఏంటి?సుందర్ తన భార్య గురించి తెలుసుకోగలిగాడా అనేది ఈ మూవీ కథ
ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే :
ఆనంద్ దేవరకొండ సెటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు.ఇక మూవీలో హీరోయిన్స్ ఇద్దరు అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ముఖ్యంగా శాన్వి రోల్ కానీ,ఆమె పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి.ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించిన హర్ష వర్ధన్ తన పాత్రకు తగిన న్యాయం చేశారు.ఇక ఫస్ట్ హాఫ్ అంతా కామికల్ గా తీసుకెళ్లిన దర్శకుడు దానికి భిన్నంగా సెకండ్ హాఫ్ ను డిజైన్ చేశారు. ఎమోషనల్ గా సాగే సెకండ్ హాఫ్ లో ల్యాగ్ కనిపించింది.హీరో తన భార్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేసే సీన్స్ బాగా పేలవంగా ఉన్నాయి.సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని కత్తెర్లు పడితే సినిమా చూసే ఆడియెన్స్ ఈ మూవీకి ఇంకా బాగా కనెక్ట్ అవుతారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సిచువేషన్స్,సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి.
అన్ని సరిగ్గా కుదరడంతో ఈ మూవీ ఈ వీకెండ్ విన్నర్ గా నిలిచింది.