అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా దేశ వ్యాప్తంగా 200 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఇక రిలీజ్ అయిన అన్ని భాషలలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా ఏడాది పాటు ఈ సినిమా తర్వాత పుష్ప ట్రెండ్ దేశ వ్యాప్తంగా నడిచింది అంటే సినిమా మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప సినిమాలోని తగ్గేదిలే అనే డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక మేనరిజంలా మారిపోయింది.
సక్సెస్ వచ్చిన ప్రతి ఒక్కరు ప్రత్యర్థికి పుష్ప తరహాలో తగ్గేదిలే అని చెప్పడం అలవాటుగా మారిపోయింది. ఇక హిందీలో కూడా ఈ సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది. పుష్ప సినిమాకి నార్త్ ఇండియన్ ప్రేక్షకులు ఎడిక్ట్ అయిపోయారు అని చెప్పాలి. ఇక సినిమాలో పాటలు కూడా అంతే స్థాయిలో అలరించాయి. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప2 రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇందులో ఫాహద్ ఫాజిల్, పుష్పరాజ్ మధ్య పవర్ ఫుల్ ఎపిసోడ్స్ ఉండనున్నాయి. రష్మిక పాత్ర కూడా సినిమాలో గట్టిగానే ఉంటుందనే టాక్ ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ కి దర్శకుడు సుకుమార్ రంగం సిద్ధం చేశాడు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటికే సెట్స్ కూడా రెడీ చేసినట్లు బోగట్టా. షూటింగ్ స్టార్ట్ చేసి బ్రేక్స్ లేకుండా కంటిన్యూగా షూట్ చేయాలనే ఆలోచనతో దర్శకుడు సుకుమార్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వచ్చే ఏడాది ఆఖరు నాటికి ఈ సినిమా అని హంగులు పూర్తి చేసిప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లో సుకుమార్ ఉన్నారని టాక్. ఇక దీనికోసం మొదటి పార్ట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టబోతున్నారు అని ఇన్ సైడ్ టాక్.