స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన పుష్ప మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ గా పుష్పరాజ్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈ నెల 13 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బ్యాంకాక్ లో మొదలు కాబోతుంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఫస్ట్ షెడ్యూల్ ని సుకుమార్ స్టార్ట్ చేయబోతున్నారు. ఏకధాటిగా నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. ఇక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఈ షెడ్యూల్ లో ప్లాన్ చేసి సుకుమార్ గ్రాండియర్ గా ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారు.
ఇక ఈ మూవీలో ఫాహద్ ఫాజిల్ యాంటీ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ లో ఇంటర్నేషనల్ స్మగ్లర్ గా పుష్పరాజ్ ఎలా ఎదిగాడు అనే విషయాన్ని సుకుమార్ చూపించబోతున్నాడు. రష్మిక మందన పాత్ర కూడా సినిమాలో కీలకంగా ఉంటుంది. అలాగే మొదటి పార్ట్ లో ఉన్న నటీనటులు అందరూ కూడా రెండో భాగంలో కొనసాగనున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా లెవల్ లో పుష్ప మూవీకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సీక్వెల్ మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాని పవర్ ఫుల్ గా సుకుమార్ తెరకెక్కించబోతున్నారు.
ఇక ఈ పుష్పరాజ్ సిరీస్ ని మైత్రీ మూవీస్ వాళ్ళు రెండో పార్ట్ తో వదిలేయకుండా ఫ్రాంచైజ్ స్టోరీస్ గా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్ట్ 2 కి వచ్చిన రెస్పాన్స్ బట్టి కంటిన్యూగా నెక్స్ట్ సీక్వెల్ కూడా ఉండేలా సుకుమార్ తో మాట్లాడినట్లు టాక్. ఇక బన్నీ కూడా ఈ సినిమా అంతకుమించి ఉంటుందని రీసెంట్ గా చెప్పడం ద్వారా ఈ సారి గట్టిగానే పుష్పరాజ్ ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.