వినాయక చవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా గణేష్ మండపాలు వేలాది సంఖ్యలో పెడుతూ ఉంటారు. హిందువులు అందరూ ఈ గణేష్ నవరాత్రి వేడుకల్ని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇక గణేష్ ప్రతిమలని ప్రతిష్టించి తొమ్మది రోజుల పాటు నిష్ఠతో పూజలు చేస్తారు. అలాగే చివరి రోజు చాలా వైభవంగా నిమ్మజనోత్సవాలు జరుపుతారు. అయితే ఈ గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా నిర్వాహకులు వారి వారి టేస్ట్ కి తగ్గట్లు ట్రెండింగ్ వినాయక ప్రతిమలని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇండియన్ వైడ్ గా లేదంటే హాట్ ట్టాపిక్ అయిన సినిమాలోని హీరో పాత్రల ప్రేరణతో గణేష్ విగ్రహాలు తయారు చేసి వాటిని మండపాల్లో పెడుతూ ఉంటారు.
అలాగే అభిమాన హీరో తరహాలో వినాయక విగ్రహాల ప్రతిమలని కళాకారులు సిద్ధం చేసి నిర్వాహకులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి రెండు వినాయక విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహారాష్ట్రలో ఒక ప్రాంతంలో పుష్ప సినిమాలోని పుష్పరాజ్ తరహాలో వినాయక విగ్రహం చేయించి ప్రతిష్టించారు. దీనిని అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేజీలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. పుష్ప సినిమాలోని పుష్పరాజ్ తగ్గేదిలే అనే డైలాగ్ అలాగే అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ యాటిట్యూడ్ ఏ స్థాయిలో మానియా సృష్టించిందో అందరికి తెలిసిందే.
ఈ నేపధ్యంలోనే వినాయక విగ్రహాన్ని కూడా పుష్పరాజ్ తరహాలోనే సిద్ధం చేయడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే మరో చోట ఆర్ఆర్ఆర్ సినిమాలోని అల్లూరి సీతారామరాజు గెటప్ లో రామ్ చరణ్ బ్రిటిష్ వారిపై బాణాలు సంధిస్తూ ఉంటాడు.అదే తరహాలో గణేష్ విగ్రహాన్ని తయారు చేసి ఓ చోట ప్రతిష్టించారు. ఇప్పుడు ఈ రెండు విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి విగ్రహాలు మరిన్ని బయటకి వచ్చే అవకాశం నవరాత్రి వేడుకల సందర్భంగా బయటకొచ్చే అవకాశం ఉంది.