Pushpa: ఫిలిం ఫేర్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం బెంగళూరులో అట్టహాసంగా జరిగింది. కరోనా వైరస్ కారణంగా గడిచిన కొన్నేళ్లు ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. కానీ ఈ సంవత్సరం ఫిలిం ఫేర్ అవార్డుల పండగ నటీ నటుల మధ్య ఘనంగా జరిగింది. ఈ సారి ఫిలిం ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్, దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ లకు వరించింది. సినిమా అవార్డుల విషయానికి వస్తే… ఈ ఏడాది ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా హవా నడిచింది. మొత్తం ఈ సినిమా ఏడూ విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ గాయకుడు, ఉత్తమ గాయని, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి.
•ఉత్తమ చిత్రం: పుష్ప – ది రైజ్
• ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప – ది రైజ్)
• ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప – ది రైజ్)
• ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప – ది రైజ్)
• ఉత్తమ గాయకుడు: సిద్ద్ శ్రీరామ్ (పుష్ప ది రైజ్ – శ్రీవల్లి)
• ఉత్తమ గాయని: ఇంద్రావతి చౌహాన్ (పుష్ప ది రైజ్ – ఊ అంటావా మావ)
• ఉత్తమ సినిమాటోగ్రాఫర్: మిరోస్లా బ్రొజెక్ (పుష్ప – ది రైజ్)
దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ పుష్ప సినిమా ఫిలింఫేర్ అవార్డులను క్లీన్ స్వీప్ చేసిందని, అందరకి ధనవ్యవాదాలంటూ ట్వీట్ చేశారు.
#PUSHPA CLEAN SWEEP AT @filmfare . BEST ACTOR , BEST DIR , BEST MUSIC DIR , BEST CINEMATOGRAPHY , BEST MALE SINGER , BEST FEMALE SINGER & BEST FILM . THANK YOU ALL . HUMBLED 🙏🏽
— Allu Arjun (@alluarjun) October 10, 2022
Pushpa:
తెలుగులో మిగతా విభాగాల్లో ఫిలిం ఫేర్ అవార్డుల సాధించిన విజేతలు…
• ఉత్తమ నటి: సాయిపల్లవి (లవ్‌స్టోరీ)
• ఉత్తమ సహాయనటుడు: మురళీ శర్మ (అల వైకుంఠపురములో)
• ఉత్తమ సహాయనటి: టబు (అల వైకుంఠపురములో)
• ఉత్తమ గేయ రచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి (జాను) (లైఫ్ ఆఫ్ రామ్)
• విమర్శకుల ఉత్తమ నటి: సాయిపల్లవి (శ్యామ్‌సింగ్‌రాయ్)
• విమర్శకుల ఉత్తమ నటుడు: నాని (శ్యామ్‌సింగరాయ్)
• ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్ (అల వైకుంఠపురములో – రాములో రాములా)
• ఉత్తమ నూతన నటి: కృతిశెట్టి (ఉప్పెన)
• ఉత్తమ నూతన నటుడు: వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)
— Kandula Dileep (@TheLeapKandula) October 10, 2022