విభిన్నమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించే సుకుమార్ సినిమాలకు ఓవర్ సిస్ లో మంచి మార్కెట్ ఉంది.అందుకే గతంలో ఆయన దర్శత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో,రంగస్థలం మూవీ లకు ఓవర్ సీస్ లో మంచి ఆదరణ లభించింది తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీకి కూడా ఓవర్ సీస్ లో మంచి ఆదరణ లభిస్తుంది.
యూ.ఎస్ ప్రీమియర్స్ తోనే మిలియన్ డాలర్లు కొల్లగొట్టాలని భావించిన చిత్ర యూనిట్ యూ.ఎస్ లో స్క్రీన్ లను భారీగా పెంచింది.వారి ప్రయత్నం సక్సెస్ అయ్యిందని తాజాగా ఓవర్ సీస్ లో మూవీ చూసి వచ్చిన వాళ్ళు చెబుతున్నారు.తాజాగా అందుతున్న యూ.ఎస్ రిపోర్ట్ ప్రకారం పుష్ప మూవీ సినీ అభిమానులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.శేషాచలం అడువులలో పెరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్,సెకండ్ ఆఫ్,క్లైమాక్స్ మూవీకి హైలెట్స్ గా నిలిచాయి.
ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో లెవల్ లో నిలబెట్టింది.ఈ మూవీలో కొత్తగా కనిపించిన బన్నీ లుక్స్ తోనే కాదు పర్ఫార్మెన్స్ తో కూడా సినీ అభిమానులను అలరిస్తున్నారు.ఈ మూవీలో పుష్ప రాజ్ నే కాదు అందరినీ కెమెరా కన్ను అందంగా చూపించింది.సునీల్,అనసూయ,రావు రమేష్,ఫాహద్ ఫాజిల్ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.రష్మీక మందాన తన అందం అభినయంతో ఆకట్టుకుంది.తన కెరియర్ లో తొలిసారి ఐటెం సాంగ్ చేసిన సమంత డ్యాన్స్ లతో,హావభావాలతో,అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.ఈ సాంగ్ సినీ అభిమానులకు ఫీస్ట్ లా ఉంటుంది.ఓవర్ సీస్ లో మంచి రిపోర్ట్ ను సాధించిన ఈ మూవీ రేపు ఇక్కడ ప్రేక్షకుల ముందుకు రానున్నది.తెలుగుతో పాటు మలయాళం మరియు ఇతర భాషలలో మంచి క్రేజ్ ఉన్న బన్నీ తన తొలి పాన్ ఇండియా మూవీతో ఇక్కడ ప్రేక్షకులను మెప్పిస్తారో వేచి చూడాల్సింది.