లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ పుష్ప అనే మూవీ చేస్తున్నారు.ఈ మూవీతో సుకుమార్ బన్నీ ముచ్చటగా మూడవసారి జతకట్టారు.దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు సుకుమార్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కోసం 190 కోట్లు ఖర్చు చేశారు.సునీల్,యాంకర్ అనసూయ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా,మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
ఓవర్ సీస్ లో ఈ మూవీ రిలీజ్ ను చిత్ర యూనిట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంది అందుకే ఈ మూవీ కోసం పెద్ద ఎత్తున స్క్రీనింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది.యూఎస్ ప్రీమియర్ తోనే మిలియన్ మార్క్ ను క్రాస్ చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్ ముందుగా అనుకున్న స్క్రీన్స్,షోస్ ను మరింత పెంచాలని ఆలోచనలో ఉంది.ప్రస్తుతం యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఈ మూవీ రెండు లక్షల డాలర్ల మార్క్ ను ఈజీగా అందుకుంటుందని ప్రచారం జరుగుతుంది.సామ్ తొలిసారి చేసిన ఐటెం సాంగ్ కోసం,బన్నీ యాక్షన్ కోసం,రష్మీక గ్లామర్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కోవిడ్ కొత్త వేరియంట్ ప్రబలుతున్న వేళ యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద చిత్ర యూనిట్ ఆశించిన ఫలితాన్ని పుష్ప అందుకోగలదో లేదో వేచి చూడాల్సివుంది.