సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ 17న ప్రేక్షకులు ముందుకు వచ్చింది.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ బరిలో మిశ్రమ స్పందనతో నడుస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మీక మందాన హీరోయిన్ గా నటించింది.మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ సునీల్ విలన్ లుగా,యాంకర్ అనసూయ సునీల్ భార్యగా ఈ మూవీలో మనకి కనిపిస్తారు.కెరియర్ లో తొలిసారి సమంత చేసిన ఐటెం సాంగ్ ఈ మూవీకి మంచి ఆదరణ తెచ్చి పెట్టింది.అలాంటి ఈ మూవీ గురించి గత రెండు రోజులగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
దాని ప్రకారం ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని జనవరి మొదటి వారంలో తమ ప్లాట్ ఫారంలో విడుదల చేస్తుంది అని ప్రచారం చేశారు.తాజాగా ఈ ప్రచారంపై స్పందించిన నిర్మాతలు ఈ వార్తలో అసలు నిజం లేదు.ఈ మూవీ విడుదలైన నాలుగు లేదా ఆరు వారాల తర్వాత మాత్రమే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది అని ఓ క్లారిటీ ఇచ్చారు.