సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తెలుగులోనే కాక ఇతర భాషలలో కూడా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలో తన సత్తా చాటుతూ దూసుకెళ్తుంది.ఈ మూవీలో ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో కనిపించిన బన్నీ సరసన రష్మీక మందాన హీరోయిన్ గా నటించింది.మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ సునీల్ విలన్ లుగా,యాంకర్ అనసూయ సునీల్ భార్యగా కనిపించి కనువిందు చేశారు.మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని జనవరి 7వ తేదీన విడుదల చేయబోతుందట.ఆరోజు రిలీజ్ అవ్వాల్సిన ఆర్.ఆర్.ఆర్ వాయిదా పడడంతో అమెజాన్ ప్రైమ్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.త్వరలో దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఉండనుంది.