థియేటర్స్ లో ఒక పక్క అఖండ మూవీతో సినీ అభిమానులను అలరిస్తున్న బాలయ్య మరోపక్క తన టాక్ షో అన్ స్టాపబుల్ ఎపిసోడ్స్ తో ఓటిటి వీక్షకులను అలరిస్తున్నారు.ఈ టాక్ షో తర్వాత ఎపిసోడ్ లో పుష్ప మూవీతో బాలయ్య ముచ్చటించనున్నారు.ప్రస్తుతం పుష్ప బాక్స్ ఆఫీస్ రేసులో డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికి దూసుకుపోతున్న నేపథ్యంలో దాన్ని మరింత పెంచుకునేందుకు చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ షోలలో పాల్గొంటుంది.బాలయ్యతో ఈ షోలో బన్నీ,రష్మీక మందాన,సుకుమార్ పాల్గొనబోతున్నారు.ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలు కానున్నది.
ప్రస్తుతం పుష్ప ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ ను నెక్స్ట్ విడుదల చేయాలనే నిర్ణయానికి షో యూనిట్ వచ్చిందట అందుకే రవితేజ,గోపీచంద్ మలినేని ఎపిసోడ్ ను డిసెంబర్ 31కు షో యూనిట్ మార్చిందని సమాచారం