సుకుమార్ దర్శకత్వంలో బన్నీ రష్మిక మందాన కలిసి నటించిన పుష్ప మూవీ తాజాగా విడుదలైంది.తెలుగుతో పాటు ఇతర భాషలలో మంచి ఆదరణ పొందిన బన్నీ దాన్ని క్యాష్ చేసుకోవడానికి తన మిత్రుడు సుకుమార్,దేవి శ్రీ ప్రసాద్ తో కలిసి తొలి పాన్ ఇండియా మూవీతో ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చారు మరి వారి ప్రయత్నం సక్సెస్ అయ్యిందో లేదో ఇప్పుడు చూద్దాం.
ముందుగా కథ విషయానికి వస్తే :
కూలీగా జీవితాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్ గంధపు చెక్కల స్మగ్లింగ్ సిండికేట్ కు బాస్ ఎలా అయ్యాడు.అతని ఎదుగుదల ఎలా సాగింది.పుష్పరాజ్,శ్రీవల్లి పరిచయం ఎటు దారి తీసింది.పుష్పరాజ్ విజయానికి కొండారెడ్డి సోదరులు ఎలా హెల్ప్ అయ్యారు.మంగళం శ్రీను పుష్పరాజ్ జీవితాన్ని ఎలా మార్చాడు అనేది ఈ మూవీ కథ
ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే :
ఫస్ట్ హాఫ్ హీరోయిజం, ఎలివేషన్ ల మీద కాకుండా కథ మీదా సాగింది.పుష్పరాజ్ క్యారెక్టరైజేషన్,పర్ఫార్మెన్స్ మరియ అతని స్నేహితులు,ఊ అంటావా మావా ఉ ఉ అంటావా మావా సాంగ్ ఫస్ట్ హాఫ్ కు ప్రధాన బలాలుగా నిలిచాయి.ఫ్లాట్ నేరేషన్,బలహీన విలన్ పాత్ర ఫస్ట్ హాఫ్ డ్రా బ్యాక్స్ గా చెప్పుకోవచ్చు.సెకండ్ హాఫ్ సినీ అభిమానులను పూర్తిగా నిరాశ పరిచింది.ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ చాలా వీక్ గా ఉన్నాయి.మూవీ లాస్ట్ 30 మినిట్స్ అసలు ఎం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేది ఏం అర్థం కాదు. ఫాహద్ ఫాజిల్ కు ఈ మూవీలో చెప్పుకోదగ్గ పాత్ర ఏమి లేదు.
లుక్స్,పర్ఫార్మెన్స్, డైలాగ్ డెలివరీలతో బన్నీ తనేంటో మరోసారి నిరూపించుకున్నాడు.ఇక రష్మీక మందాన తనకున్న స్కోప్ కు తగట్టు నటించి మెప్పించింది.ఇక మంగళం శ్రీనుగా సునీల్,ఆయన భార్యగా అనసూయ పర్వాలేదనిపించారు.ఇక రావు రమేష్ తదితరులు తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ వాటిని అందుకోలేక చతికిల పడి యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.