స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ గత ఏడాది ఆఖరు లో రిలీజ్ అయ్యి దేశ వ్యాప్తంగా సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా సౌత్ లో కంటే నార్త్ ఇండియాలో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్ కి అల్లు అర్జున్ తన బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకున్నాడు. అయితే సినిమా హిస్టరీలో ఫస్ట్ టైం, అలాగే డిజిటల్ మీడియా యుగం స్టార్ట్ అయిన తర్వాత ఎవ్వరికి రాని అరుదైన క్రేజ్ పుష్ప మూవీకి వచ్చింది. ఈ ఏడాది మొత్తం డిజిటల్ మీడియాలో పుష్ప మానియా నడిచింది అంటే ఏ రేంజ్ లో సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్, మేనరిజమ్ కి క్రేజ్ గా మారిపోయాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ వాడే తగ్గిదేలే అనే డైలాగ్ సోషల్ మీడియాలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాటగా మారిపోయింది.
సినిమాలో హీరో తన ఆటిట్యూడ్ ని చూపించుకోవడానికి వాడిన ఈ డైలాగ్ కి వరల్డ్ వైడ్ గా పాపులారిటీ వచ్చేసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, క్రికెటర్స్ వరకు అందరూ కూడా ఈ డైలాగ్ మేనరిజాన్ని అనుకరించడం సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. తగ్గేదిలే అనే డైలాగ్ తో కోట్లాది షార్ట్ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యాయి. అలాగే విదేశీ క్రీడాకారులు ఆట మధ్యలో వికెట్ తీసినపుడు గెడ్డం మీద చేయి వేసి తగ్గేదిలే అంటూ మేనరిజం చూపించడం సంచలనంగా మారింది. ఇలా ఈ ఒక్క డైలాగ్ సోషల్ మీడియా ద్వారా ఇండియా నుంచి వరల్డ్ పాపులర్ అయిన మేనరిజమ్స్ లో ఒకటిగా ఈ ఏడాది మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన పాటల జాబితాలో పుష్ప సినిమా నుంచి రెండు సాంగ్స్ ఉండటం విశేషం.
శ్రీవల్లి సాంగ్ ని ఈ ఏడాది ఏకంగా 55 కోట్ల మందికి పైగా వీక్షించడం విశేషం. అలాగే ఆ సాంగ్ లో అల్లు అర్జున్ వేసిన డాన్స్ స్టెప్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. కోట్లాది షార్ట్ వీడియోలు ఈ శ్రీవల్లి సాంగ్ అందులో డాన్స్ బిట్ తో వచ్చాయి. తరువాత అదే స్థాయిలో రష్మిక మీద చిత్రీకరించిన నా సామీ సాంగ్ కి విశేషమైన ఆదరణ వచ్చింది. ఈ సాంగ్ ని ఏకంగా 50 కోట్లకి పైగా యుట్యూబ్ లో వీక్షించారు. అందులో డాన్స్ మూమెంట్ కూడా భాగా పాపులర్ అయ్యింది. ఆ తరువాత తెలుగు నుంచి ఆ స్థాయిలో సత్తా చాటిన మరో సాంగ్ కూడా పుష్పలో సమంత మీద చిత్రీకరించిన ఊ అంటావా సాంగ్ ఉంది. ఈ సాంగ్ టాప్ 10 హిట్స్ లో 8వ స్థానంలో నిలిచింది. ఇలా ఈ ఏడాది దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో పుష్ప మానియా నడిచింది అని చెప్పాలి.