గతంలో ఆర్య,ఆర్య2 మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్,సుకుమార్ కాంబినేషన్‌లో తాజాగా పుష్ప మూవీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది.దాదాపు 12 ఏళ్ల తర్వాత సుకుమార్,బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే పుష్ప రాజ్ గా కనిపించారు.తన లుక్స్ అండ్ పర్ఫార్మెన్స్ తో బన్నీ అందరినీ ఆకట్టుకుంటున్నారు.ఈ మూవీలో బన్నీ సరసన రష్మీక మందాన హీరోయిన్ గా నటించింది.ఈ పార్ట్ లో సునీల్ మెయిన్ విలన్ గా కనిపించి కనువిందు చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మొదటి రోజు దాదాపు అన్ని దగ్గర్ల ఫుల్ అకూపెన్సీతో నడించింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ 34.4 కోట్లు షేర్ ను వసూలు చేసింది.మొత్తం 5 భాషలకు గాను 45 కోట్ల 50 లక్షలు 121 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేస్తున్న పుష్ప రాజ్ బాక్స్ ఆఫీస్ ముందు తన సత్తా చాటుతున్నారు.
తాజాగా బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ మూవీ ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ రేసులో బ్రేక్ లేకుండా దూసుకుపోయింది.ఇక బాక్స్ ఆఫీస్ రేసులో పుష్ప రాకతో ఆ మూవీ జోరు తగ్గనుంది.