సుకుమార్ దర్శకత్వంలో బన్నీ,రష్మిక మందన కలిసి నటిస్తున్న మూవీ పుష్ప.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ముందు అనుకున్న బడ్జెట్ ను మించిపోతుంది.కోవిడ్ కారణంగా కాల్ షీట్లు పెరగడం,సుకుమార్ ముందు కంపోజ్ చేసుకున్న సీన్స్ మార్చడం వల్ల ఈ మూవీ బడ్జెట్ 40 కోట్లు పెరిగిపోయింది.తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ హిందీ వెర్షన్ ప్రొడ్యూసర్స్ జేబులకు భారం కానున్నదని ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది.
దీంతో ఈ మూవీని ప్రమోట్ చేసే బాధ్యతను అల్లు అర్జున్ తన భుజాల పైకి ఎత్తుకున్నారు.అందులో భాగంగా మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న కొందరు బాలీవుడ్ హీరోలతో ఈ అంశంపై చర్చిస్తున్నారట.మరి అవి సఫలం అవుతాయో లేదో వేచి చూడాలి.