సుకుమార్ దర్శకత్వంలో బన్నీ రష్మీక మందాన కలిసి నటిస్తున్న పుష్ప మూవీ నుండి చిత్ర యూనిట్ బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ ను విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీలో సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.వాళ్ళు క్యారెక్టర్స్ కు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై సినీ అభిమానులలో ఆసక్తి రేపుతున్నాయి.
ఈ మూవీ తెలుగు,తమిళ్,మలయాళం,కన్నడ భాషలకు బన్నీ స్వయంగా డబ్బింగ్ చెబుతున్నాడని సమాచారం.ఇతర భాషలలో మూవీ ఇంపాక్ట్ ను సినీ అభిమానులు మిస్ అవ్వకూడదని సుకుమార్ కోరడంతో బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.