సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ బరిలో మిశ్రమ స్పందనతో నడుస్తున్న ఈ మూవీలో బన్నీ సరసన రష్మీక మందాన హీరోయిన్ గా నటించింది.మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ సునీల్ విలన్ లుగా,యాంకర్ అనసూయ సునీల్ భార్యగా ఈ మూవీలో మనకి కనిపిస్తారు.కెరియర్ లో తొలిసారి సమంత చేసిన ఐటెం సాంగ్ ఈ మూవీకి మంచి ఆదరణ తెచ్చి పెట్టింది.తాజాగా ఈ మూవీ యూ.ఎస్ బాక్స్ ఆఫీస్ బరిలో 2.2 మిలియన్ డాలర్ల మార్క్ ను దాటింది.
ప్రస్తుతం ఈ మూవీ అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఫీట్ అందుకున్న టాప్ తెలుగు 15 మూవీస్ లో ఒకటిగా నిలిచింది.ప్రస్తుతం ఈ టాప్ 15 లో పద్నాలుగవ స్థానంలో నిలిచిన ఈ మూవీ ఈ లిస్ట్ ఎంత ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.