సుకుమార్ దర్శకత్వంలో బన్నీ,రష్మీక మందాన కలిసి నటిస్తున్న పుష్ప మూవీ రెండు భాగులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్నది.వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి ఈ మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ మొదలుకానుంది.
ఫస్ట్ పార్ట్ ఫలితాన్ని బట్టి సెకండ్ పార్ట్ షూటింగ్ జరగనున్నది.ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు సుకుమార్ పుష్ప ధి రైస్ కి 190 కోట్లు ఖర్చు చేశారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూవీ టికెట్స్ తగ్గించడం,ప్రత్యేక షోలు వేసుకోవడానికి పర్మెషన్ లు ఇవ్వకపోవడం,యుఎస్ లో తాజాగా మార్వెల్ స్పైడర్ మ్యాన్ రిలీజ్ అవ్వడం వల్ల థియేటర్స్ దొరికే పరిస్థితులు లేకపోవడంతో పుష్ప కమర్షియల్ సక్సెస్ ను అందుకోవడం చాలా కష్టంగా మారిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.