Puri Jagannath – Vijay Devarakonda: పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండలలో..ఎవరు ఎవరిని నమ్మి మోసపోయి ఉంటారు..? ఇప్పుడిదే నెటిజన్స్‌లో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. దీనికి కారణం వీరి కాంబినేషన్‌లో వచ్చిన లైగర్ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాల మధ్య విడుదలై పెద్ద డిజాస్టర్‌గా మిగలడమే. కెరీర్ ప్రారంభంలో పూరి తీసిన సినిమాలు బద్రి, ఇడియట్, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, శివమణి లాంటి సినిమాలు భారీ హిట్స్‌గా నిలిచాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పోకిరి 75 ఏళ్ళ రికార్డ్స్‌ను బద్దలు కొట్టింది.

ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్ మేన్ కూడా మంచి కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అలా పూరి కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. ఆయన దర్శకత్వంలో నటించిన హీరోలకు విపరీతమైన మాస్ ఇమేజ్ కూడా దక్కింది. అయితే, పూరి.. ఆంధ్రావాలా, దేవుడు చేసిన మనుషులు, నేనింతే, రోగ్, ఇజం, లోఫర్ లాంటి ఫ్లాప్ సినిమాలను తీశారు. హిట్స్ ఎన్ని ఇచ్చారో ఫ్లాప్స్ కూడా అన్నే ఉన్నాయి. ఇప్పటి వరకు దర్శకుడిగా ఎవరూ సంపాదించలేనంత డబ్బును పూరి సంపాదించారు.
Puri Jagannath – Vijay Devarakonda: ఎవరినెవరు నమ్మినా చివరికి మాత్రం సక్సెస్ చూడలేకపోయారు.
అంత స్టామినా ఉన్నా కూడా ఫ్లాప్స్ వల్ల ఆయన కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాక రాక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ సాధిస్తే..దాన్ని నిలబెట్టుకోలేపోయారు పూరి. ఇస్మార్ట్ శంకర్ సినిమాకి ముందు పూరితో సినిమా చేయడానికి హీరోలు మొహం చాటేశారు. ఆ సమయంలో పూరిని నమ్మిన ఒకే ఒక్క హీరో రామ్ పోతినేని. ఈ హీరోకి హిట్స్ లేవు. అయినా పూరి నమ్మారు. అలా ఇస్మార్ట్ శంకర్ చేసి ఫాంలోకి వచ్చారు. ఇప్పుడు లైగర్ సినిమాకి ముందు చూసుకుంటే విజయ్ ఫ్లాప్స్‌లో ఉన్న హీరో. అయినా పూరి తన మీద నమ్మకం పెట్టుకున్నారు.
విజయ్ కూడా ఇలాంటి సమయంలో పడాల్సింది ఇలాంటి డైరెక్టర్ చేతిలోనే అనుకున్నాడు. ఇద్దరు ఒకరిపై ఒకరు చాలా నమ్మకం పెట్టుకున్నారు. అభిమానులు అంతకంటే నమ్మకం వీరిపై పెట్టుకున్నారు. కానీ, లైగర్ అందరికీ గట్టి షాకిచ్చింది. ఎవరినెవరు నమ్మినా చివరికి మాత్రం సక్సెస్ చూడలేకపోయారు. దాంతో ఇప్పుడు చేస్తున్న జనగణమన సినిమాపై అందరిలోనూ కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే, ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. అయితే, లైగర్ ప్రభావం వల్ల జనగణమన మొత్తానికే ఆగిపోయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై పూరి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.