పూరి జగన్నాధ్ కెరియర్ లో లైగర్ అతి పెద్ద డిజాస్టర్ అంటే సంగతి తెలిసిందే. ఇది వరకు ఫ్లాప్ లు వచ్చినా కూడా నష్టాల పరంగా మాత్రం ఈ మూవీ పూరిని బాగా ఇబ్బంది పెట్టింది. భారీగా పెట్టుబడి పెట్టి సినిమాని తెరకెక్కించారు. పూరి జగన్నాధ్ మీద నమ్మకంతో డిస్టిబ్యూటర్స్ ముందుగానే భారీ రేట్లు పెట్టి ఈ సినిమా రైట్స్ ని కొన్నారు. అయితే మొదటి రోజు మొదటి ఆట నుంచే సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. రెండో రోజుకి థియేటర్స్ అన్నీ ఖాళీ అయిపోయాయి. దీంతో డిస్టిబ్యూటర్స్ కి ఊహించని షాక్ తగిలింది. ఇక ఎగ్జిబిటర్స్ అందరికి తిరిగి డబ్బులు ఇస్తానని నెల రోజులు సమయం అందించిన పూరి జగన్నాధ్ వారికి రిక్వస్ట్ చేశాడు. అయితే ఏమైందో ఏమో అనుకున్న సమయానికి డబ్బులు అడ్జస్ట్ చేయలేకపోయాడో ఏమో కానీ ఎగ్జిబిటర్స్ అందరూ పూరి జగన్నాధ్ ఇంటి దగ్గర ధర్నా చేశారు వారి వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రచారం చేశారు.
ఇక ఆ విషయం పూరి జగన్నాధ్ కి తెలియడంతో ఫోన్ లోనే వారికి పూరి వార్నింగ్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు సినిమా హిట్ అవుతుందనే తీస్తారు. థియేటర్స్ లో ఆడకపోతే అది నా తప్పు కాదు. కానీ బాధ్యత తీసుకొని ఎగ్జిబిటర్స్ నష్టపోకూడదు అనే ఉద్దేశ్యంతో డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పాను. అయిన కొంత మంది నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వను. నా హిట్ సినిమాలకి వచ్చిన డబ్బులని ఎగ్జిబిటర్స్ దగ్గర వసూలు చేయడానికినాకు ఎంత కష్టపడ్డానో తెలుసు. ఇప్పటికి కొంత మంది నాకు డబ్బులు ఇవ్వాలి. అయిన నేను ఎవరిని బెదిరించలేదు. లైగర్ ఫ్లాప్ అయ్యిందని, నష్టపోయామంటూ అందరూ నా దగ్గరకి వస్తున్నారు.
మనం ఆడుతుంది గ్యాంబ్లింగ్. దీనిలో లాభం వస్తుంది, ఒక్కోసారి నష్టం వస్తుంది. పోగొట్టుకున్న డబ్బు తిరిగి కావాలని డిమాండ్ చేసి బెదిరించడం సరైన పద్ధతి కాదు. ఒక వేళ అలా బెదిరించాలి అనుకున్న వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. మీరు ఏం చేస్తారో చేసుకోండి. మర్యాదగా ఉన్నవారికి మాత్రమే ఎంతో కొంత డబ్బులు ఇస్తాను. నా పరువు తీయాలని చూస్తే నేను ఎంత వరకు అయిన వెళ్తా. నన్ను తగ్గించే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలు క్షమించను. ఒక్క పైసా కూడా అలాంటివారికి ఇవ్వను అంటూ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో ఫుల్ గా సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ ఇష్యూ ఎంత వరకు వెళ్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.