పూరి జగన్నాధ్ ని లైగర్ సినిమా ఎన్నడూ లేనంతగా వెంటాడుతుంది. పూరి కెరియర్ లో ఇప్పటి వరకు చాలా ఫ్లాప్ లు వచ్చాయి. అయితే ఏ సినిమాకి రానంత నెగిటివిటీ ఈ మూవీ తీసుకొచ్చింది. దానికి కారణంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని రిలీజ్ చేయడం ఒకటైతే. రిలీజ్ కి ముందే పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ మీద నమ్మకంతో డిస్టిబ్యూటర్స్ సినిమా రైట్స్ భారీ ధరకి కొనేయడం కూడా కారణం అని చెప్పాలి. అయితే సినిమా మొదటి ఆట నుంచి ఫ్లాప్ టాక్ రావడంతో రెండో రోజు నుంచి ఈ మూవీ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి.
హిందీలో కొన్న రేటు కంటే ఎక్కువ డబ్బులే కలెక్ట్ చేయడంతో అక్కడ డిస్టిబ్యూటర్స్ సేఫ్ అయిపోయారు. అయితే తెలుగు రాష్ట్రాలలో డిస్టిబ్యూటర్స్ పరిస్థితి అది కాదు. భారీగానే నష్టపోయారు. ఈ నేపధ్యంలో తమ నష్టాన్ని తిరిగి ఇవ్వాలని డిస్టిబ్యూటర్స్ తిరిగి పూరిని సంప్రదించడం, ఒక నెల రోజులు గడువు కోరడం జరిగింది. అయితే ఈ మధ్యలో బయ్యర్లకి, పూరి జగన్నాధ్ కి ఎక్కడో చెడింది. దీంతో డిస్టిబ్యూటర్స్ అందరూ హైదరాబాద్ లో పూరి జగన్నాధ్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని వారి వాట్సాప్ గ్రూప్స్ లో ప్రచారం చేశారు. లైగర్ డిస్టిబ్యూటర్స్ అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనాలని కూడా సూచించారు.
అయితే దీనిని వెనకుండి నడిపిస్తుంది. వరంగల్ శ్రీను, శోభన్ బాబు అనే డిస్టిబ్యూటర్స్ అనే విషయం పూరి జగన్నాధ్ దృష్టికి వచ్చింది. దీంతో పూరి వారికి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదే సమయంలో తాజాగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో వారి మీద ఫిర్యాదు చేశాడు. తన కుటుంబానికి ఆ ఇద్దరి నుంచి ప్రాణహాని ఉందని కంప్లైట్ చేశాడు. తనని బెదిరిస్తున్నారని, తాను లేని సమయంలో ఇంటి దగ్గరకి వెళ్లి కుటుంబ సభ్యులని బెదిరించి, భయపెట్టి డబ్బులు వసూలు చేసే కుట్ర చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు పూరి కామెంట్స్ మీద కానీ, ఫిర్యాదు మీద గాని డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను స్పందించలేదు. మరి ఇది ఎంత వరకు వెళ్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.