Puri Jagannadh Assistant: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ కు ఈ మధ్యకాలంలో సినిమాలు పెద్దగా కలిసి రాలేదని తెలుస్తోంది. వరుస ఫ్లాప్ సినిమాలు తర్వాత ఇస్మార్ట్ శంకర్ కాస్త ఊపిరినిచ్చినప్పటికీ ఈ సినిమాతో సంపాదించినది మొత్తం లైగర్ సినిమా కోసం ఖర్చుపెట్టి నష్టపోయారు. ఇలా ఈ సినిమాతో భారీగా నష్టపోయిన ఈయనకు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నాయి.
ఈ సినిమా నష్టాలను తేవడంతో ఈయన తదుపరి ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా పూరి జగన్నాథ్ అసిస్టెంట్ సాయికుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం పూరి జగన్నాథ్ ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. సాయికుమార్ పూరి జగన్నాథ్ దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశారు.అయితే ఈయన దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. దుర్గం చెరువులో శవం దొరకడంతో విచారణ చేపట్టిన పోలీసులు చనిపోయిన వ్యక్తి పూరి జగన్నాథ్ అసిస్టెంట్ సాయికుమార్ అని తెలిసింది.
ఇకపోతే సాయికుమార్ పూరి జగన్నాథ్ దగ్గర గతంలో పలు సినిమాలకు పని చేశారు. అయితే ఈయన పూరి కనెక్ట్స్ ప్రారంభించిన తర్వాత తన పాత టీం మొత్తాన్ని తొలగించి కొత్త టీమ్ ను అపాయింట్మెంట్ చేసుకున్నారు.అయితే సాయికుమార్ పాత టీమ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తోంది. ఇక పూరి జగన్నాథ్ ముంబై వెళ్ళిపోవడంతో సాయికుమార్ కి ఏ విధమైనటువంటి పని దొరకక విపరీతమైన అప్పులు చేశారని తెలుస్తోంది.

Puri Jagannadh Assistant: సినిమా అవకాశాలు లేకే అప్పుల పాలైన సాయికుమార్
ఈ విధంగా అప్పులు చేసినటువంటి సాయికుమార్ పై అప్పు ఇచ్చిన వ్యక్తులు తమ దగ్గర తీసుకున్న అప్పు చెల్లించాలని అధిక ఒత్తిడి తీసుకురావడంతో ఈయన ఏం చేయాలో దిక్కు తోచని నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన పూరి జగన్నాథ్ ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇలా పూరి జగన్నాథ్ కు ఒకవైపు లైగర్ సినిమా ఫ్లాప్ కావడం, మరోవైపు జనగణమన షూటింగ్ ఆగిపోవడం, ఇలా అసిస్టెంట్ మరణ వార్త ఒక్కసారిగా ఆయనను ఎంతగానో కలిసి వేస్తున్నాయని చెప్పాలి.