Godfather: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎంతో కష్టపడి చేసిన సినిమా ‘ఆచార్య’ డిజాస్టర్‌తో డీలా పడిన మెగాస్టార్.. ‘గాడ్ ఫాదర్’ మూవీ ఎలా అవుతుందోనని ఒకింత కంగారు పడ్డారు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకోవడంతో ఆయనతో పాటు సినిమా టీం అంతా కూడా ఆ సక్సెస్ మూడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. సక్సెస్ మీట్.. అది.. ఇది అంటూ తెగ హడావుడి చేస్తోంది. మరి ఇంత హడావుడిలోనూ సినిమాలోని తారాగణమంతా కనిపిస్తోంది కానీ ఒక కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరి జగన్నాథ్ కనిపించరే.. అందరి మదినీ తొలిచేస్తున్న క్వశ్చన్ ఇదే.
సినిమా విడుదలైన మూడు రోజులకే సక్సెస్ మీట్‌ని చిత్ర బృందం ఏర్పాటు చేసింది.ఈ వేడుకకి సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్స్ నుంచి నటీనటుల వరకూ అంతా వచ్చారు. అయితే హాట్ టాపిక్ ఏంటంటే.. స్వయంగా మెగాస్టారే కాల్ చేసి మరీ ఆహ్వానించినప్పటికీ పూరి ఈ సక్సెస్ మీట్‌కి రాలేనని చెప్పేశారట. మెగాస్టార్ పిలిస్తే పూరి రాననడమా? అసలు ఆయనకు ఏమైందంటూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.అయితే దీనికి పూరి ఏదో విషయంలో నొచ్చుకుని రాకపోవడమో మరొకటో కారణం కాదని తెలుస్తోంది.
ఎన్నో అంచనాలతో.. ఎంతో కష్టపడి రూపొందించిన సినిమా ‘లైగర్’ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడిన విషయం తెలిసిందే. దీంతో పూరి చాలా డిజప్పాయింట్ అయ్యారు. ప్రస్తుతం పూరి తన దృష్టంతా తర్వాతి సినిమాపైనే పెట్టారు. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వరకూ ఆయన తనమునకలై ఉన్నారు. మరోవైపు పూరితో సినిమాకు అటు హీరోలు కానీ.. ఇటు నిర్మాతలు కానీ సిద్ధంగా లేరని టాక్. దీంతో పూరి బయటకు కూడా రాలేకపోతున్నారని టాక్. ‘గాడ్ ఫాదర్’ మూవీలో మాత్రం పూరీ నటనకు 100కు 100 మార్కులు పడ్డాయి. స్వయంగా చిరంజీవే ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు.