Punjab CM : పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై ప్రతిపక్ష శిరోమణి అకాలీదళ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫుల్లుగా మద్యం తాగి విమానం ఎక్కితే సీఎంను ఫ్లైట్ నుంచి దించేశారని శిరోమణి అకాలీదళ్ ట్విటర్ వేదికగా ఆరోపించింది. జర్మనీ పర్యటన నుంచి సోమవారం స్వదేశానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఆయన ఫుల్లుగా తాగి ఉండటంతో దించేశారని.. దీంతో విమానం నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరిందని అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ ట్విటర్‌లో ఆరోపించారు. మాన్ నిర్వాకం వల్ల ప్రపంచం ముందు పంజాబ్ పరువు పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టిపారేసింది.
తమ ముఖ్యమంత్రిని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆప్ పేర్కొంది. కాగా, సీఎం మాన్‌ను విమానం నుంచి దించివేయడం నిజమే అయితే దీనిపై విచారణ జరిపించాలని మరోవైపు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మరోవైపు జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఈ అంశంపై వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యమైన మాట నిజమేనని, అనుబంధ విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని పేర్కొంది. కాగా, సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకున్న భగవంత్ మాన్ నేరుగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. గంటకు పైగా కేజ్రీతో భేటీ అయ్యారు. అనంతరం పంజాబ్‌కు బయలుదేరారు.
Punjab CM: బీజేపీ గూటికి అమరీందర్ సింగ్
తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్న సీఎం భగవంత్ మాన్ విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఈ నెల 22న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తమ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఇవ్వజూపిందంటూ ఆప్ నేతలు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా.. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రె్‌స(పీఎల్‌సీ) అధ్యక్షుడు అమరీందర్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. అంతేకాకుండా పీఎల్‌సీని కూడా ఆ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఎదుర్కొన్న కొన్ని పరిణామాల వల్ల ఆ పార్టీని, సీఎం పీఠాన్ని అమరీందర్ సింగ్ వీడారు.