కన్నడ పవర్ స్టార్ పునీత్ తాజాగా గుండెపోటుతో మరణించారు.దీంతో యావత్ సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.ఆయన మరణానంతరం పునీత్ కుటుంబ సభ్యులు ముందుకొచ్చి ఆయన కళ్ళను నేత్రదానం చేశారు.
తాజాగా ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన నారాయణ నేత్రాలయ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ భుజంగ్ శెట్టి సాధారణంగా ఒక వ్యక్తి కళ్ళతో ఇద్దరికి కంటి చూపు తెప్పించగలం కానీ సాంకేతికతను ఉపయోగించి పునీత్ కళ్ళతో నలుగురికి కంటిచూపు తెప్పించగలిగం పునీత్ కుటుంబ సభ్యులు తన కళ్ళను దానం చేయడానికి ముందుకు రావడం వల్లే ఇది సాధ్యపడిందని ఆయన అన్నారు.శుక్రవారం పునీత్ కళ్ళను సేకరించిన హాస్పిటల్ వారు మరుసటి రోజు వాటిని కంటి చూపు లేనివారికి అమర్చారు.